Cinema politics: తెలుగు సినిమా పరిశ్రమపై బిజెపి కన్ను
ABN, First Publish Date - 2022-11-23T14:27:53+05:30
కేంద్రం లో వున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ మీద దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. రాబోయే ఎన్నికల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమని వాడుకోవాలని అనుకుంటున్నట్టు కనపడుతోంది.
కేంద్రం లో వున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ మీద దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం లో ఎలా అయినా పాగా వేయాలన్న దృఢ సంకల్పంతో వున్న బిజెపి, అందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమని వాడుకోవాలని అనుకుంటున్నట్టు కనపడుతోంది. కొన్ని రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కి 'ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ 2022' అవార్డు ఇచ్చి సత్కరించారు. ఇది గోవాలో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో ఈ అవార్డు ని ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్కాస్టింగ్ మంత్రి ప్రకటించారు. దీని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిరంజీవి ని ప్రశంసిస్తూ ట్వీట్ కూడా చేసారు. అదీ కాకుండా ప్రధాని కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ గారు పరమపదించినప్పుడు తెలుగులో ట్వీట్ చేసారు.
ఇవి ఇలా ఉండగా, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ని రాజ్యసభ సభ్యుడిగా చేసినప్పుడే బిజెపి తెలుగు చిత్ర పరిశ్రమని తనకి దగ్గరగా చేసుకుంటోంది అని టాక్ అప్పట్లో నడిచింది. ఆ తరువాత జూనియర్ ఎన్ఠీఆర్ ని అమిత్ షా కలవటం కూడా బాగా వైరల్ అయింది. పోనీ అదొక్కటే చేసి వూరుకున్నారా, తరువాత ఇంకో నటుడు నితిన్ ని కూడా కలిశారు బి బె పి అధ్యక్షుడు జె పి నడ్డా. అలాగే మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ పార్టీ తరపున ప్రచారం చేశారు.
సీనియర్ నటుడు కృష్ణం రాజు మరణించినప్పుడు బీజేపీ నాయకులూ అందరూ లైన్ కట్టి మరీ వెళ్లి ప్రభాస్ కి సంతాపం తెలిపారు. ఇప్పుడు చిరంజీవి కి ఈ అవార్డు ఇవ్వటం ఇవన్నీ చూస్తుంటే బీజేపీ తెలుగు చలన చిత్ర పరిశ్రమకి దగ్గరవుతున్నట్టు కనపడుతోంది కదా. రాబోయే ఎన్నికల్లో పరిశ్రమ నుండి కొంతమంది నటులు, దర్శకులు పార్టీ కి ప్రచారం కూడా చేయొచ్చు అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఏమైనా కూడా బీజేపీ ఈసారి చాలా గట్టిగా తెలంగాణాలో పాగా వెయ్యాలని చూస్తోంది, అందుకు అన్నీ సిద్ధం చేసుకుంటున్నట్టు కనపడుతోంది, ముఖ్యంగా సినిమా పరిశ్రమ నుండి తమకి నెగటివ్ లేకుండా.
Updated Date - 2022-11-23T14:45:40+05:30 IST