ఓ వైపు కూతురు ట్యూషన్ చెబుతుంటే.. మరోవైపు తండ్రి చేసిన నిర్వాకం.. రోజూ చాక్లెట్లు ఇస్తూ..
ABN, First Publish Date - 2022-11-06T17:30:12+05:30
కాటికి కాళ్లు చాపే వయసులో.. కొందరు వృద్ధులు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటారు. కూతురు, మనువరాలు వయసున్న పిల్లలతో కూడా వక్ర దృష్టితో చూస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది..
కాటికి కాళ్లు చాపే వయసులో.. కొందరు వృద్ధులు కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తుంటారు. కూతురు, మనువరాలు వయసున్న పిల్లలతో కూడా వక్ర దృష్టితో చూస్తుంటారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ 65 ఏళ్ల వృద్ధుడి కూతురు వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. పిల్లలకు ఇంటి వద్ద ట్యూషన్ చెబుతూ ఉంటుంది. కూతురు ఓ వైపు ట్యూషన్ చెబుతుంటే.. మరోవైపు తండ్రి తప్పులు చేయడం మొదలెట్టాడు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ప్రియురాలి ఇంటికి కొడుకును తీసుకెళ్లిన తండ్రి.. ఆ విషయం మర్చిపోమన్న తల్లి.. చివరకు..
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) దుర్గ్ జిల్లా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన షాహదత్ హుస్సేన్ అనే 65ఏళ్ల వృద్ధుడి కుమార్తె వృత్తిరీత్యా (teacher) ఉపాధ్యాయురాలు. ఈమె తన ఇంట్లో 1నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యూషన్ చెబుతూ ఉంటుంది. ఆమె వద్దకు సమారు 30మంది బాలబాలికలు (Boys and girls) చదువుకోవడానికి వస్తుంటారు. అయితే ట్యూషన్ టీచర్ తండ్రి.. బాలికలపై కన్నేశాడు. రోజూ పిల్లలతో మాట్లాడే క్రమంలో అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించేవాడు. అప్పుడప్పుడూ పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తూ.. తాకరాని చోట తాకడం, కౌగిలించుకోవడం చేస్తుండేవాడు.
పర్సు లాక్కెళ్లారని ఫిర్యాదు చేసిన మహిళ.. అసలు విషయం తెలుసుకుని వణికిపోయిన పోలీసులు..
బాలికలు భయంతో ఇన్నాళ్లూ ఎవరికీ చెప్పలేదు. అయితే శనివారం ఓ బాలిక ఇంటికి వెళ్లగానే.. ధైర్యం చేసి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో చాలా మంది బాలికలు ముందుకు వచ్చి.. తమ పట్ల కూడా ఇలాగే ప్రవర్తించాడని చెప్పారు. చివరకు బాలికల తల్లిదండ్రులు, స్థానికులు కలిసి పోలీస్ స్టేషన్‍కు చేరుకుని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వృద్ధుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా.. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2022-11-06T17:30:15+05:30 IST