Fight on flight:బ్యాంకాక్-కోల్‌కతా విమానంలో ప్రయాణీకుల మధ్య కొట్లాట...వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-12-29T07:00:37+05:30 IST

థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య కొట్లాట జరిగింది...

Fight on flight:బ్యాంకాక్-కోల్‌కతా విమానంలో ప్రయాణీకుల మధ్య కొట్లాట...వీడియో వైరల్
Fight on flight

కోల్‌కతా: థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య కొట్లాట జరిగింది.(Fight on flight) బ్యాంకాక్ నుంచి కోల్‌కతా(Bangkok-Kolkata flight) వచ్చిన థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. విమానంలోనే ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడిని చెంపదెబ్బలు కొట్టాడు.(Physical brawl between passengers) విమానంలో జరిగిన ఈ ఫైట్ వీడియోను రికార్డు చేసిన ఓ ప్రయాణికుడు దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.

ఘర్షణ పడుతున్న విమాన ప్రయాణికులను శాంతించి నిశ్శబ్దంగా కూర్చోవాలని విమాన సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ లు ప్రయత్నించినా కొట్లాట జరిగింది. ఓ విమాన ప్రయాణికుడు ఎదుటి ప్రయాణికుడిని కొట్టాడు. కొట్లాట తర్వాత కొంతమంది ఫ్లైట్ అటెండెంట్లు, తోటి ప్రయాణికులు వారిద్దరి ఘర్షణను అడ్డుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ స్పందించలేదు. ఘర్షణ పడిన ప్రయాణికులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Updated Date - 2022-12-29T10:49:11+05:30 IST