ప్రేయసి ఇంటికి తమ్ముడిని పంపించిన అన్న.. కుటుంబ సభ్యులకు జ్యూస్ ఇచ్చిన కూతురు.. వేకువజాము లేచి చూస్తే..
ABN, First Publish Date - 2022-10-26T16:48:19+05:30
ఆ దంపతులకు ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. అయితే వీరికి అందరిలా కాకుండా కూతురు లేదనే లోటు ఉండేది. దీంతో ఎలాగైనా కూతురు కావాలనే ఉద్దేశంతో దత్తతకు తీసుకుని పెంచుకున్నారు. కొడుకుతో సమానంగా కూతురును కూడా ఏలోటూ లేకుండా చూసుకున్నారు. ఇటీవలే ఆమెకు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే..
ఆ దంపతులకు ఒకే ఒక్క కొడుకు ఉన్నాడు. అయితే వీరికి అందరిలా కాకుండా కూతురు లేదనే లోటు ఉండేది. దీంతో ఎలాగైనా కూతురు కావాలనే ఉద్దేశంతో దత్తతకు తీసుకుని పెంచుకున్నారు. కొడుకుతో సమానంగా కూతురును కూడా ఏలోటూ లేకుండా చూసుకున్నారు. ఇటీవలే ఆమెకు ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఉన్నట్టుండి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. కూతురు అప్పటికే ప్రేమలో ఉందనే విషయం వారికి తెలీదు. ఓ రోజు రాత్రి కుటుంబ సభ్యులకు జ్యూస్ ఇచ్చిన కూతురు.. చివరకు ప్రియుడి సోదరుడితో కలిసి చేసిన పని.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాన్పూర్ పరిధి బర్రా ప్రాంతంలో కొన్ని నెలల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మున్నాలాల్ (61), రాజ్ దేవి (55) దంపతులు .. బర్రా ప్రాంతంలోని ఈడబ్ల్యూఎస్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి అనూప్ అనే కొడుకు, కోమల్ అనే కుమార్తె ఉన్నారు. ఈ దంపతులకు కొడుకు ఒక్కడే ఉండడంతో కూతురు పట్టలేదనే బాధ ఉండేది. దీంతో 24 ఏళ్ల క్రితం కోమల్‌ను దత్తత తీసుకుని పెంచుకున్నారు. అయినా కొడుకుతో సమానంగా.. ఏలోటూ లేకుండా ప్రేమగా చూసుకునేవారు. ఇటీవల ఆమెకు వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తుండేవారు. అయితే కూతురు మాత్రం రాహుల్ అనే యువకుడితో కొన్ని నెలలుగా ప్రేమలో (love) ఉండేది. అతను ముంబైలో సైనికుడుగా (soldier) పని చేస్తున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల రాహుల్ తన ప్రియురాలిని సోదరుడు రోహిత్‌కు పరిచయం చేశాడు. దీంతో రోహిత్ కూడా ఆమెతో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో వీరి మధ్య కూడా ప్రేమాయణం నడిచింది. కాగా, కొన్ని నెలల క్రితం కోమల్ అన్న అనూప్‌కు, అతడి భార్యకు గొడవలు తలెత్తాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. విడాకులు తీసుకునేందుకు కూడా సిద్ధమైంది. తమకు రూ.50లక్షలు ముట్టచెప్పాలని అనూప్ అత్తమామలు డిమాండ్ చేశారు. దీంతో అనూప్ తండ్రి తమ సొంత ఇంటిని అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇక్కడే అసలు కుట్రకు బీజం పడింది. దత్త కూతురు కోమల్‌కు తల్లిదండ్రుల ఆస్తిపై కన్ను పడింది. ఇంటిని అమ్మేస్తే తనకు వాటా రాదని భావించి.. చివరకు ఇంటితో పాటూ మిగతా ఆస్తిని కూడా కొట్టేయాలని ప్లాన్ వేసింది. ఇందుకు అడ్డుగా ఉన్న అన్న, తల్లిదండ్రులను మట్టుపెట్టాలని నిర్ణయించుకుంది. ప్రియుడు రాహుల్, అతడి సోదరుడితో ఇదే విషయాన్ని చెప్పింది. చివరకు అంతా కలిసి పక్కా ప్లాన్ వేశారు. జూలై 5న రాత్రి రాహుల్ తన సోదరుడు రోహిత్‌ను ప్రేయసి ఇంటికి పంపించాడు.
అప్పటికే కోమల్ తన అన్నకు, తల్లిదండ్రులకు జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చింది. అర్ధరాత్రి స్నేహితులతో కలిసి ఇంట్లోకి వచ్చిన రోహిత్.. కోమల్ తల్లిదండ్రులను గొంతు నులిమి హత్య చేశారు. అయితే అనూప్ గది తలుపులు వేసుకుని పడుకోవడంతో లోపలికి వెళ్లలేకపోయారు. అందులోనూ అనూప్ జ్యూస్ కొంచెమే తాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలిచంగా ముసుగు ధరించిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి వెళ్తున్నట్లు కనిపించింది. ఇన్నాళ్లూ అంతుచిక్కని కేసు.. తాజాగా కొలిక్కి వచ్చింది. కూతురుపై అనుమానం వచ్చి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెతో పాటూ రాహుల్, రోహిత్ తదితరులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
తరచూ కూతురును చూడటం కోసం వస్తున్న తండ్రి.. చివరకు ఎవరికీ చెప్పొద్దంటూ భార్యతో అతడు చెప్పిన విషయం..
Updated Date - 2022-10-26T16:51:38+05:30 IST