ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మానుష్య ప్రదేశంలో.. కూతురు కేకలు విని పరుగెత్తుకుంటూ వెళ్లిన తల్లి.. అక్కడి దృశ్యం చూసి..

ABN, First Publish Date - 2022-11-02T19:43:23+05:30

మహిళలపై రోజురోజుకూ దాడులు (Attacks on women) పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఒంటరిగా కనిపిస్తే చాలు.. కామాంధులు దాడులకు తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్‍లో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంటిరిగా వెళ్తున్న బాలిక పట్ల కొందరు యువకులు అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించారు. ఎవరికైనా చెబితే..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలపై రోజురోజుకూ దాడులు (Attacks on women) పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఒంటరిగా కనిపిస్తే చాలు.. కామాంధులు దాడులకు తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్‍లో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంటిరిగా వెళ్తున్న బాలిక పట్ల కొందరు యువకులు అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించారు. ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే కూతురు కేకలు విన్న తల్లి.. పరుగెత్తుకుంటూ వెళ్లింది. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందంటే..

తాంత్రికుడి సలహా మేరకు.. ట్యూషన్ టీచర్ చేసిన నిర్వాకం.. చదువుకోవడానికి వచ్చిన బాలికను..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన 14ఏళ్ల బాలిక 9వ తరగతి (9th class girl) చదువుతోంది. మంగళవారం ఆమె తన తల్లితో పాటూ పొలానికి వెళ్లింది. అయితే మధ్యలో బాలిక ఒక్కటే ఇంటికి బయలుదేరింది. ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా.. మధ్యలో ఆరుగురు యువకులు ఆమెను గమనించారు. కొంత దూరం ఆమె వెనుకే వెళ్లారు. ఎవరూ లేని సమయం చూసి ఉన్నట్టుండి బాలిక నోరు మూసి, నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. అనంతరం ఆమె దుస్తులు లాగుతూ.. అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించారు.

సెల్ఫీ తీసుకుందామని పిలవడంతో.. షాపింగ్ మాల్ వెనుక వైపునకు వెళ్లింది.. కాసేపటి తర్వాత చూస్తే..

దీంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో ఆమె తల్లి కూడా ఇంటికి వెళ్తూ ఉంది. కూతురు కేకలు విని అటుగా పరుగెత్తుకుంటూ వెళ్లింది. గమనించిన నిందితులు ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బాలికను బెదిరించి, అక్కడి నుంచి పరారయ్యారు. తల్లిని పట్టుకుని ఏడుస్తూ జరిగిన దారుణం గురించి చెప్పింది. దీంతో కూతురుతో పాటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక పోలీసులు.. కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చివరకు ఉన్నతాధికారులను సంప్రదించి ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉదయాన్నే పక్కింటికి వెళ్లిన పదేళ్ల బాలుడు.. రాత్రి ప్రియుడితో కలిసి తన తల్లి చేసిన నిర్వాకం గురించి చెప్పడంతో..

Updated Date - 2022-11-02T19:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising