ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాటలు పాడుతూ యువతులతో ప్రేమ.. నాలుగు రాష్ట్రాల్లో ఆరు వివాహాలు.. ఓ రోజు రైల్వే స్టేషన్‌లో..

ABN, First Publish Date - 2022-12-01T18:53:42+05:30

అతనో ఆర్కెస్ట్రా సింగర్.. పాటలు పాడే క్రమంలో ఇతడికి చాలా మంది అభిమానులుగా మారిపోయారు. ఇందులో ఎంతో మంది యువతులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడే ..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అతనో ఆర్కెస్ట్రా సింగర్.. పాటలు పాడే క్రమంలో ఇతడికి చాలా మంది అభిమానులుగా మారిపోయారు. ఇందులో ఎంతో మంది యువతులు కూడా ఉన్నారు. అయితే ఇక్కడే సదరు గాయకుడి బుద్ధి పక్కదారి పట్టింది. తనపై యువతులు చూపించే అభిమానాన్ని అవకాశంగా తీసుకున్నాడు. మాయమాటలు చెబుతూ ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో ఆరు వివాహాలు చేసుకున్నాడు. చివరకు ఓ రోజు రైల్వే స్టేషన్‌లో ఉండగా.. గుట్టు రట్టు అయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

Viral Video: పబ్లిక్ ప్లేస్‌లో యువతుల ఫైటింగ్.. అసలు కారణం తెలుసుకుని అవాక్కవుతున్న నెటిజనం..

బీహార్‌లోని (Bihar) బర్హత్ పరిధి జవతారి గ్రామానికి చెందిన చోటు కుమార్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇతడు ఆర్కెస్ట్రాలో (Orchestra program) పాటలు పడుతూ ఉంటాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య తలెత్తింది. పాటలు పాడే క్రమంలో చోటూకు చాలా ప్రాంతాల్లో యువతీయువకులు అభిమానులుగా మారిపోయారు. దీంతో చోటూ బుద్ధి పక్కదారి పట్టింది. పాటలు పాడిన ప్రదేశాల్లో తనతో ప్రేమగా మాట్లాడే యువతులు, మహిళలను టార్గెట్ చేసేవాడు. వారిని మాయమాటలతో నమ్మించి చివరకు పెళ్లి (marriage) కూడా చేసుకునేవాడు. ఇలా ఇతడు మొత్తం నాలుగు రాష్ట్రాల్లో ఆరుగురు మహిళలను వివాహం చేసుకున్నాడు.

అన్న పెళ్లి కోసం చెల్లెలి త్యాగం.. ఎందుకిలా చేశావ్ అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం..

2018లో మంజు అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఏడాదిన్నర క్రితం మందు తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుంచి వచ్చేశాడు. అప్పటి నుంచి ఆమె వద్దకు వెళ్లలేదు. ఇలావుండగా, సోమవారం సాయంత్రం మంజు సోదరుడు వికాస్.. కోల్‌కతా (Kolkata) వెళ్లేందుకు జాముయి రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఆ సమయంలో చోటూ మరో మహిళతో కనిపించాడు. తన బావ మరో మహిళతో ఉండడాన్ని చూసి వికాస్ షాక్ అయ్యాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఎట్టకేలకు చోటూను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలన్నీ అంగీకరించాడు. అయితే మిగతా భార్యల నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదులూ అందలేదని పోలీసులు తెలిపారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

తండ్రి మరణానికి ప్రతీకారంగా యువకుడిని ప్రేమించిన కుమార్తె.. ప్రియుడితో కలిసి మరో యువతికి తన దుస్తులు వేసి మరీ..

Updated Date - 2022-12-01T18:53:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising