Santosham Film Awards: ఆరు నిముషాల డాన్స్ కోసం ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా

ABN , First Publish Date - 2022-12-07T14:47:15+05:30 IST

'వాల్తేరు వీర్రాజు' లో 'బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ' అన్న సాంగ్ కి ఆమె చిరంజీవి తో వేసిన స్టెప్పులు అదరగొట్టింది. ఇప్పుడు అదే భామ ఈ సంతోషం ఫిలిం అవార్డ్స్ లో స్టెప్పులు వేయనుంది.

Santosham Film Awards: ఆరు నిముషాల డాన్స్ కోసం ఎంత ఛార్జ్ చేసిందో తెలుసా

సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022కి రంగం సిద్ధమవుతోంది. డిసెంబర్ 26వ తేదీన హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఒక ఫంక్షన్ లో దక్షిణాది నాలుగు భాషలకు చెందిన సినిమాలకు ఈ అవార్డులు ఇవ్వనున్నారు. గత 20 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో మంచి చిత్రాలకు అవార్డులు ఇస్తూ సత్కరిస్తూ వస్తోంది సంతోషం సంస్థ. ఇందులో భాగంగానే అనేక ప్రత్యేక ఆకర్షణలు, సెలబ్రిటీస్ పాటలకు డాన్స్ చెయ్యటం, స్కిట్స్, ఇంకా చాలా ఇలాంటివి ఉంటాయి. (Santosham South Indian Film Awards)

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఇప్పుడు టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీర్రాజు' లో 'బాస్.. వేర్ ఈజ్ ది పార్టీ' అన్న సాంగ్ కి ఆమె చిరంజీవి తో వేసిన స్టెప్పులు అదరగొట్టింది. ఇప్పుడు అదే భామ ఈ సంతోషం ఫిలిం అవార్డ్స్ లో స్టెప్పులు వేయనుంది. అయితే ఈమె సుమారు ఆరు నిముషాల పాటు ఈ డాన్స్ స్టెప్పులు వేస్తుందని తెలిసింది. అయితే ఈ ఆరు నిముషాలకి ఆమె ఎంత పారితోషికం తీసుకుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. సుమారు 40 లక్షలు పారితోషికం ఆమెకి ఇచ్చిన్నట్టుగా బోగట్టా. ఆమె డిమాండ్ ఆలా వుంది మరి. (Urvashi Rautela to dance for a special song in this awards function and she charges nearly Rs 40 lakh for this 6-minute song, according to a source)

urvasi1.jpg

అందుకే ఆ అవార్డ్స్ లో గ్లామర్ ఉండాలి అని ఊర్వశి రౌతేలా డాన్స్ పెట్టించారని తెలిసింది. చిరంజీవి సినిమా, సంతోషం ఫిలిం అవార్డ్స్ కాకుండా ఇప్పుడు ఈ అమ్మడు రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తోంది. అయితే ఈ సినిమాలు అన్నీ విడుదల కాకకుండె ఆమె సంతోషం ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. ఈ అవార్డుల కార్యక్రమం ఈనెల 26వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి సుమారు 12 గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలాగా అనేక రకాల కార్యక్రమాలు డిజైన్ చేస్తున్నాడు సంతోషం సురేష్.

Updated Date - 2022-12-07T14:47:23+05:30 IST