ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

VIRAL video: సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసుల వార్నింగ్...ఎందుకంటే...

ABN, First Publish Date - 2022-12-15T09:53:39+05:30

బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపింది...

Actor Sonu Sood VIRAL Video
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబయి: బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు సోనూసూద్‌కు రైల్వే పోలీసులు వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేపింది.(WARNING) కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో పేదలకు విశిష్ఠ సేవలందించి ప్రజాదరణ పొందిన సోనూసూద్(Actor Sonu Sood) రైలు ఫుట్ బోర్డుపై కూర్చొని రైలులో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (VIRAL Video)కదులుతున్న రైలులో ఫుట్ బోర్డుపై కూర్చున్న(Sitting on Train Door) వీడియోను సోనూసూద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రైలు డోర్ వద్ద ఫుట్‌ బోర్డుపై వేలాడుతూ అజాగ్రత్తగా ప్రయాణించడంపై రైల్వేపోలీసులు(Railway Police) హెచ్చరిక జారీ చేశారు. సోనూసూద్ అజాగ్రత్త ప్రవర్తనను నెటిజన్లు సైతం నిందించారు. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో డిసెంబర్ 13వతేదీన సోనూ సూద్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు.

కదులుతున్న రైలులో ప్రమాదం అంచున...

వీడియోలో నటుడు హ్యాండ్‌రైల్ పట్టుకుని కదులుతున్న రైలు తలుపు అంచున ఉన్నారు. సూద్ తన స్క్వాటింగ్ పొజిషన్‌ను తన కాలి వేళ్లపై కూర్చొని రైలు నుంచి బయటకు చూస్తూ కనిపించారు. కదులుతున్న రైలు డోర్ నుంచి బయటకు వేలాడటం చాలా ప్రమాదకరమని పలువురు వ్యాఖ్యానించారు.ఇటీవల యువకులు కదులుతున్న రైళ్లలో విన్యాసాలు చేయడం రైల్వే అధికారులకు పెద్ద సమస్యగా మారిందని, ఇలాంటి వాటిని ప్రోత్సహించడం నటుడు సోనూసూద్ బాధ్యతారాహిత్యమని ట్విట్టర్ వినియోగదారులు ఎత్తి చూపారు.

తప్పుపట్టిన నెటిజన్లు

చాలా మంది ట్విటర్ వినియోగదారులు సోనూ సూద్‌ను తప్పుబట్టారు.ఇలాంటి అంశాలను ఆన్‌లైన్‌లో ఉంచే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని మరో నెటిజన్ సూచించారు.‘‘దేశవ్యాప్తంగా చాలా మందికి రోల్ మోడల్‌గా ఉన్నందున మీరు అలాంటి వీడియోలను పోస్ట్ చేయకూడదు’’ అని మరో నెటిజన్ కోరారు.నటుడు సోనూసూద్ పై చర్యలు తీసుకోవాలని పలువురు రైల్వే అధికారులను అభ్యర్థించారు.

Updated Date - 2022-12-15T11:03:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising