ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతి ఒక్కటే దుస్తులు మార్చుకుంటోందని తెలిసి.. లోపలికి వెళ్లిన యువకుడు.. యువతి ఎంతకీ బయటికి రాకపోవడంతో..

ABN, First Publish Date - 2022-10-24T19:47:46+05:30

కొందరు యువకులు.. యువతుల ఇష్టాయిష్టాలు తెసుకోకుండా ప్రవర్తిస్తుంటారు. ఇష్టం ఉన్నా లేకున్నా ప్రేమించాలంటూ వెంటపడుతుంటారు. ఇలాంటి వారి వేధింపులు భరించలేక కొందరు యువతులు చివరకు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. మరికొందరు యువకులు.. తమనే ప్రేమించాలంటూ వెంటబడడం, వినకపోతే దాడులు చేయడం చేస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు యువకులు.. యువతుల ఇష్టాయిష్టాలు తెసుకోకుండా ప్రవర్తిస్తుంటారు. ఇష్టం ఉన్నా లేకున్నా ప్రేమించాలంటూ వెంటపడుతుంటారు. ఇలాంటి వారి వేధింపులు భరించలేక కొందరు యువతులు చివరకు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంటారు. మరికొందరు యువకులు.. తమనే ప్రేమించాలంటూ వెంటబడడం, వినకపోతే దాడులు చేయడం చేస్తుంటారు. కేరళలో ఇటీవల ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువతి విషయలో యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. ఆమె ఒక్కటే గదిలో దుస్తులు మార్చుకుంటోందని తెలిసి లోపలికి వెళ్లాడు. అయితే యువతి ఎంతకీ బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి, లోపలికి వెళ్లి చూశారు. అక్కడి దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వివారల్లోకి వెళితే..

కేరళలోని (Kerala) కన్నూర్ నగర పరిధి పానూరులో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. కన్నార్‌కు చెందిన విష్ణుప్రియ (23) అనే యువతి.. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో (Medical Lab) పని చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు కూతుపరంబాకి ప్రాంతానికి చెందిన శ్యామ్‌జిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతడి ప్రవర్తన మొదట్లో మంచిగా ఉండడంతో ఆమె కూడా తరచూ మాట్లాడుతూ ఉండేది. అయితే ఓ రోజు అతను ఆమె వద్దకు వెళ్లి లవ్ ప్రపోజ్ (Love proposal) చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. మాట్లాడినంత మాత్రాన ఇలా ప్రేమిస్తున్నానని చెప్పడం నాకు నచ్చలేదంటూ తిరస్కరించింది. అయినా యువకుడు మాత్రం తననే ప్రేమించాలంటూ వెంటబడేవాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన యువతి.. చివరకు ప్రేమించేది లేదంటూ తెగేసి చెప్పింది. దీంతో విష్ణుప్రియపై పగ పెంచుకున్నాడు. తనకు దక్కంది ఎవరికీ దక్కకూడదని కుట్రపన్నాడు.

ఈ క్రమంలో ఓ రోజు యువతి తన బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లింది. ఈ విషయం తెలిసి శ్యామ్ కూడా ఆమెను అనుసరిస్తూ వెళ్లాడు. కార్యక్రమం అనంతరం యువతి ఓ గదిలో ఒంటరిగా దుస్తులు మార్చుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్ కూడా లోపలికి వెళ్లాడు. వెళ్లీవెళ్లగానే ఆమెపై ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో యువతి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. గదిలోకి వెళ్లిన యువతి ఎంతకీ బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి చూడటానికి వెళ్లారు. గదిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న కూతురును చూసి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చివరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Updated Date - 2022-10-24T19:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising