ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులు.. 5 సార్లు గుంజీళ్లు తీయించి వదిలేశారు..!

ABN, First Publish Date - 2022-11-24T19:11:36+05:30

ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. బాలికలు, యువతులపై దాడులు ఆగడం లేదు. ఆఖరికి ఉరి శిక్షలు వేస్తున్నా కూడా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. రోజు ఎక్కడో చోట..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్ని కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. బాలికలు, యువతులపై దాడులు ఆగడం లేదు. ఆఖరికి ఉరి శిక్షలు వేస్తున్నా కూడా నేరస్థుల్లో మార్పు రావడం లేదు. రోజు ఎక్కడో చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక మారుమూల గ్రామాల్లో జరిగే చాలా ఘటనలు వెలుగులోకి రావడం లేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పంచాయతీలు నిర్వహించి, గ్రామ పెద్దలే శిక్షలు ఖరారు చేయడం చూస్తూనే ఉన్నాం. కొన్ని గ్రామాల్లో నిందితులకు విచిత్రమైన శిక్షలు వేస్తుంటారు. బీహార్‌లో ఇలాంటి ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఐదేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే గ్రామ పెద్దలు ఐదు గుంజీలు తీయించి పంచించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

WhatsApp Video call: వాట్సప్‌ కాల్‌ను లిఫ్ట్ చేయడమే అతడి పాలిట శాపమైంది.. రూ.63 వేలు పోయినా..

బీహార్ (Bihar) నవాడ అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ 22ఏళ్ల యువకుడు.. ఐదేళ్ల వయసున్న బాలిక (girl) పట్ల అసభ్యకరంగా (Indecent behavior) ప్రవర్తించాడు. బాలికకు చాక్లెట్ ఆశ చూపించి, తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఈ క్రమంలో అతడు బాలికను తాకరాని చోట తాకుతూ అనుచితంగా ప్రవర్తించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాలికను అతడి వద్ద నుంచి లాక్కెళ్లారు. తర్వాత గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. అయితే వారు మాత్రం విచిత్రంగా కేవలం ఐదు గుంజీలు తీయించి పంపించారు. అయితే ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో వైరల్ అవడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో స్థానిక పోలీసులు స్పందించారు. చివరకు బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

యువతితో వివాహితుడి ప్రేమాయణం.. విషయం తెలిసి భార్య వదిలేయడంతో.. ప్రియురాలి వద్దకు వెళ్లి..

Updated Date - 2022-11-24T20:30:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising