ప్రియురాలితో కలిసి బయటికి వెళ్లిన యువకుడు.. అంతలో డీజే వాయించాలంటూ స్నేహితుడి నుంచి ఫోన్.. తీరా అక్కడికి వెళ్లగా..
ABN, First Publish Date - 2022-11-09T19:43:43+05:30
చోటూ అనే యువకుడు పెళ్లిళ్లలో డీజే వాయిస్తూ ఉంటాడు. ఇదిలావుండగా, ఇతనికి ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నాళ్లకు..
వారిద్దరూ ప్రేమించుకున్నారు. తన పుట్టిన రోజు నాడే ప్రేయసిని భార్యగా చేసుకోవాలని కలలు కన్నాడు. అందుకు తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నాడు. ప్రతి లవ్ స్టోరీలో సమస్యలు తలెత్తినట్లే.. ఈ స్టోరీలో కూడా ప్రేమికులకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. నా చెల్లెలిని మర్చిపోవాలంటూ ప్రియురాలి సోదురుడి నుంచి బెదిరింపులు స్టార్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రియురాలిపై మరో యువకుడు కూడా ప్రేమ పెంచుకున్నాడు. దీంతో అప్పటిదాకా ఉన్న సమస్యలు మరింత పెరిగిపోయాయి. ఇటీవల ఓ రోజు ప్రేమికులిద్దరూ సరదాగా బయటికి వెళ్లారు. అంతలో డీజే వాయించాలంటూ స్నేహితుడి నుంచి ఫోన్ వచ్చింది. తీరా అక్కడికి వెళ్లిన యువకుడి పరిస్థితి చివరకు ఏమైందంటే..
పెళ్లి సంబంధం చెడిపోవడమే మేలనుకున్న యువతి.. వంట మనిషి ఇచ్చిన ఓదార్పుతో.. ఓ రోజు భయంభయంగానే..
బీహార్ పాట్నాలోని (Bihar Patna) కంకర్‌బాగ్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన చోటూ అనే యువకుడు పెళ్లిళ్లలో డీజే (DJ at weddings) వాయిస్తూ ఉంటాడు. ఇదిలావుండగా, ఇతనికి ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొన్నాళ్లకు ఈ విషయం చోటూ ప్రియురాలి అన్న చందన్‌కి తెలిసింది. తన చెల్లెలిని మర్చిపోవాంటూ పలుమార్లు చోటూను హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇటీవల చందన్ స్నేహితుడు వికాస్ అనే యువకుడు తరచూ ఇంటికి వస్తుండేవాడు. చందన్ చెల్లెలిపై వికాస్ కూడా ప్రేమ పెంచుకున్నాడు. అయితే ఆమె చోటూతో ప్రేమలో ఉండడం అతడికి నచ్చలేదు. మనసులో చోటూపై కోపం పెంచుకున్నాడు. ఇటీవల చోటూ తన ప్రియురాలిని వివాహం (marriage) చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 7న చోటూ పుట్టిన రోజు (birthday) కావడంతో అదే రోజు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయం చందన్, వికాస్‌కి తెలిసి తట్టుకోలేకపోయారు.
తల్లీకొడుకులు అయి ఉండి ఇదేం పని.. అచ్చం విజయ్ సినిమాల్లో చూపించినట్టుగానే..
ఇటీవల చోటూ తన ప్రియురాలితో కలిసి బయటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న వికాస్.. యువతి సోదరుడు చందన్‌కి ఫోన్ చేసి చెప్పాడు. ఎలాగైనా చోటూ అంతమొందిచాలని మాట్లాడుకున్నారు. శనివారం వికాస్.. చోటూకు ఫోన్ చేసి, డీజే వాయించాలని చెప్పాడు. దీంతో చోటూ.. వారు చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ అప్పటికే చందన్, వికాస్, మనీష్ అనే వ్యక్తి ఉన్నారు. కాసేపటికి చోటూతో గొడవపడి, ఉన్నట్టుండి ఒక్కసారిగా అంతా కలిసి దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన చోటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. గమనించిన స్థానికులు చోటూను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కొడుకు మృతదేహంపై పడి తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వికాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న చందన్, మనీష్ కోసం గాలిస్తున్నారు. చోటూ మృతితో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
కూతురు ప్రేమ గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు.. మూడేళ్లుగా ఇంట్లో చేసిన నిర్వాకం.. సడన్‌గా..
Updated Date - 2022-11-09T19:44:44+05:30 IST