ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rishabh Pant: నేను రిషభ్‌పంత్‌ను.. రక్షించిన వ్యక్తితో ఇండియన్ క్రికెటర్

ABN, First Publish Date - 2022-12-30T17:03:39+05:30

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌ పంత్(Rishabh Pant) ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్‌ పంత్(Rishabh Pant) ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. డెహ్రాడూన్‌ (Dehradun)లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదం బారినపడడాన్ని మొదట చూసింది బస్ డ్రైవర్ సుశీల్. కారులో చిక్కుకున్న పంత్‌ను బయటకు లాగి ప్రాణాలు కాపాడింది ఆయనే.

డివైడర్‌ను ఢీకొని కారులో మంటలు చెలరేగడాన్ని చూసిన సుశీల్ వెంటనే కారు వద్దకు చేరుకున్నాడు. కారు అద్దాన్ని బద్దలుగొట్టి పంత్‌ను బయటకు లాగాడు. తనను రక్షించేందుకు వచ్చిన సుశీల్‌తో పంత్.. తన పేరు రిషభ్ పంత్ అని చెప్పుకొచ్చాడు. బయటకు లాగాక కుంటుతూ నడిచాడు. ఆ తర్వాత పంత్‌ను డెహ్రాడూన్ ఆసుపత్రికి తరలించారు.

సుశీల్ మాట్లాడుతూ.. తాను హరిద్వార్ (Haridwar) వైపు నుంచి వస్తున్నట్టు చెప్పాడు. ఢిల్లీ వైపు నుంచి వస్తున్న పంత్ కారు ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని, అది చూసిన వెంటనే తాను బస్సు ఆపానని పేర్కొన్నాడు. పంత్ కారు బారికేడ్‌ను ఢీకొట్టి 200 మీటర్లు దూసుకెళ్లినట్టు తెలుస్తోంది.

పంత్‌ను అలా చూడగానే తామంతా ఆందోళన చెందామని, అయితే అదృష్టవశాత్తు అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని డీడీసీఏ కార్యదర్శి సిద్ధార్థ్ సాహిబ్ సింగ్ పేర్కొన్నారు. పంత్ చికిత్సకు అయ్యే ఖర్చునంతా ప్రభుత్వం భరిస్తుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి(Pushkar Singh Dhami) చెప్పారు. పంత్ చికిత్సకు అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రమాదంలో పంత్ నుదుటికి గాయాలయ్యాయని, వీపుపై కాలిన గాయాలు అయ్యాయని బీసీసీఐ(BCCI) పేర్కొంది. కుడి మోకాలి కీలు స్థానభ్రంశం చెందినట్టు తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించింది. తాను పంత్ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు బీసీసీఐ కార్యదర్శి జైషా(Jay Shah) పేర్కొన్నారు. పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంకా వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నారు. అతడికి అన్ని రకాల సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. త్వరగా కోలుకోవాలని జైషా ఆకాంక్షించారు.

Updated Date - 2022-12-30T17:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising