Dinesh Karthik: బంగ్లాతో మ్యాచ్‌కు కార్తీక్ దూరం?
ABN , First Publish Date - 2022-11-01T05:13:46+05:30 IST
సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలున్నాయి.

అడిలైడ్: సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. దీంతో బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు అతడు దూరమయ్యే అవకాశాలున్నాయి. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో వెన్ను నొప్పితో అతడు మైదానం వీడగా.. చివరి ఐదు ఓవర్లు రిషభ్ పంత్ కీపింగ్ చేశాడు. గాయం తీవ్రతపై ఇంకా స్పష్టత రాకపోవడంతో కార్తీక్ ఆడే విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని బోర్డు అధికారి ఒకరు చెప్పారు. అయితే, ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ దినేష్ విఫలం కావడంతో.. అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంత్‌ను టీమ్‌లోకి తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
అతను ఆస్ట్రేలియాలో ఆడాడా..?: సెహ్వాగ్
పంత్‌ను కాదని కార్తీక్‌కు తుదిజట్టులో చోటుకల్పించడంపై మాజీ ఓపెనర్ సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. అసలు కార్తీక్ ఆస్ట్రేలియాలో ఎప్పుడు ఆడాడు? అని ప్రశ్నించాడు. అక్కడి పిచ్‌లపై ఆడిన పంత్‌కు తుది జట్టులో చోటు కల్పించడాన్ని సమర్థిస్తానన్నాడు.