Kuldeep Yadav : కూల్చేసిన కుల్దీప్
ABN , First Publish Date - 2022-12-16T00:20:13+05:30 IST
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. 22 నెలల సుదీర్ఘ విరామం తర్వాత లభించిన అవకాశాన్ని అతడు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాటింగ్‌లో 40 రన్స్‌తో

40 రన్స్.. 4 వికెట్లతో అదుర్స్
సిరాజ్‌కు 3 వికెట్లు
బంగ్లా తొలి ఇన్నింగ్స్ 133/8
భారత్ 404 ఆలౌట్
చిట్టగాంగ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కుల్దీప్ యాదవ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. 22 నెలల సుదీర్ఘ విరామం తర్వాత లభించిన అవకాశాన్ని అతడు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాటింగ్‌లో 40 రన్స్‌తో పాటు.. బౌలింగ్ (4/33)లో బంగ్లా మిడిలార్డర్ ను కూల్చాడు. దీంతో తొలి టెస్టు లో రెండో రోజే మ్యాచ్‌ను శాసించే స్థితికి భారత్ చేరింది. సిరాజ్ (3/14) కూడా ఆకట్టుకోవడంతో గురువారం బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లలో 133/8 స్కోరుతో నిలిచింది. క్రీజులో మెహిదీ హసన్ (16), ఎబాదత్ (13) ఉన్నారు. ప్రస్తుతం భారత్‌కన్నా బంగ్లా 271 రన్స్ వెనుకబడి ఉంది. దీంతో బంగ్లా ఫాలోఆన్ తప్పాలంటే మరో 72 రన్స్ చేయాలి. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 404 రన్స్ వద్ద ముగించింది. శ్రేయాస్ (86), అశ్విన్ (58) అర్ధసెంచరీలు చేశారు.
అదిరిన భాగస్వామ్యం: 278/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆటను ఆరంభించిన భారత్ ఆదిలోనే శ్రేయాస్ వికెట్‌ను కోల్పోయింది. తన స్కోరుకు మరో 4 పరుగులు జోడించాక అతడిని ఎబాదత్ బౌల్డ్ చేశాడు. అప్పటికి జట్టు స్కోరు 293/7. దీంతో 350 రన్స్ కూడా కష్టమే అనిపించింది. కానీ తొలి సెషన్‌లో అశ్విన్-కుల్దీ్‌ప జోడీ ఏకంగా 33.2 ఓవర్లపాటు క్రీజులో నిలిచి ఎనిమిదో వికెట్‌కు 92 రన్స్‌ను జోడించింది. కుల్దీప్ స్పెషలిస్ట్ బ్యాటర్ తరహాలో ఆకట్టుకున్నాడు. తొలి పరుగు తీసేందుకు 18 బంతులు ఎదుర్కొన్నా ఆ తర్వాత స్లాగ్, రివర్స్ స్వీప్‌లతో ఔరా అనిపించాడు. 40 పరుగులతో కెరీర్ బెస్ట్ సాధించాడు. అటు అశ్విన్ అర్ధసెంచరీ పూర్తి చేశాక మెహిదీ ఓవర్‌లో స్టంపయ్యాడు. తర్వాతి ఓవర్‌లోనే కుల్దీప్ అవుటవగా ఉమేశ్ (15 నాటౌట్) రెండు సిక్సర్లతో స్కోరును 400 దాటించాడు.
అటు పేస్.. ఇటు స్పిన్: బంగ్లా ఇన్నింగ్స్‌లో తొలి బంతికే ఓపెనర్ షంటోను సిరాజ్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో బంగ్లా వికెట్లను కోల్పోయింది. టాప్-4 ఆటగాళ్లలో ముగ్గురిని సిరాజ్ అవుట్ చేయగా ఉమేశ్ ఓ వికెట్ తీశాడు. 56/4తో కష్టాల్లో పడిన బంగ్లాను ఆ తర్వాత కుల్దీప్ కోలుకోనీయలేదు. మిడిలార్డర్‌లో నాలుగు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 25వ ఓవర్‌లో బంతి తీసుకున్న అతడు స్పిన్‌కు పేస్‌ను జోడించి ఇబ్బందిపెట్టాడు. తన రెండో బాల్‌కే కెప్టెన్ షకీబ్ (3)కు షాక్ ఇచ్చాడు. ఇక చివరి ముగ్గురు బ్యాటర్లను కుల్దీప్ తన వరుస రెండు ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు.
స్కోరుబోర్డు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 133.5 ఓవర్లలో 404; బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: షంటో (సి) పంత్ (బి) సిరాజ్ 0; జాకీర్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; యాసిర్ (బి) ఉమేశ్ 4; లిట్టన్ దాస్ (బి) సిరాజ్ 24; ముష్ఫికర్ (ఎల్బీ) కుల్దీప్ 28; షకీబ్ (సి) కోహ్లీ (బి) కుల్దీప్ 3; నురుల్ హసన్ (సి) గిల్ (బి) కుల్దీప్ 16; మెహిదీ హసన్ (బ్యాటింగ్) 16; తైజుల్ (బి) కుల్దీప్ 0; ఎబాదత్ (బ్యాటింగ్) 13; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 44 ఓవర్లలో 133/8. వికెట్ల పతనం: 1-0, 2-5, 3-39, 4-56, 5-75, 6-97, 7-102, 8-102. బౌలింగ్: సిరాజ్ 9-1-14-3; ఉమేశ్ యాదవ్ 8-1-33-1; అశ్విన్ 10-1-34-0; కుల్దీప్ యాదవ్ 10-3-33-4; అక్షర్ పటేల్ 7-3-10-0.