Share News

Engagement Ceremony Twist: వింత ఘటన.. ప్రేయసి నిశ్చితార్థం ఆపిన యువతి.. అసలు కథ మామూలుగా లేదుగా..

ABN , Publish Date - Mar 06 , 2025 | 03:32 PM

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్‌లో ఓ అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చేయాలని ఇరుకుటుంబాల పెద్దలూ భావించారు. వధూవరులు కూడా ఇష్టపడడంతో నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు.

Engagement Ceremony Twist: వింత ఘటన.. ప్రేయసి నిశ్చితార్థం ఆపిన యువతి.. అసలు కథ మామూలుగా లేదుగా..
Engagement Ceremony Twist

ఉత్తర్ ప్రదేశ్: ప్రేమ ఎంత పవిత్రమైనదో అంతే విచిత్రమైనది. ఎప్పుడు ఎవరికి ఎవరిపై ప్రేమ పుడుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అలా గాఢంగా ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేకపోతే ఆ బాధ నెక్స్ట్ లెవల్ ఉంటుందనే చెప్పాలి. తన ప్రేయసి లేదా ప్రియుడికి వారి తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే దాన్ని ఆపేందుకు వారు చేయని ప్రయత్నాలు ఉండవు. అలాంటప్పుడే తాళి కట్టే సమయంలో వెనక ఎక్కడ్నుంచో "ఆపండి" అనే డైలాగ్ వస్తుంటుంది. ఇది పాత సినిమాల్లో ఫేమస్ డైలాగ్.. అయినా ఇప్పటికీ అనేక పెళ్లిళ్లలో వినిపిస్తుంటుంది. తాజాగా అలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కానీ, అక్కడ జరిగిన ట్విస్ట్ చూసి అంతా నోరెళ్లబెట్టారు.


ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్‌లో ఓ అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చేయాలని ఇరుకుటుంబాల పెద్దలూ భావించారు. వధూవరులు కూడా ఇష్టపడడంతో నిశ్చితార్థం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓ ఫంక్షన్ హాలును తీసుకుని భారీగా ఏర్పాట్లు చేశారు. రెండు కుటుంబాలకు చెందిన బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుక సంప్రదాయ పద్ధతుల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వధూవరులిద్దరూ స్జేజ్‌పై కూర్చోగా పురోహితుడు వేదమంత్రాలు పఠిస్తూ శుభకార్యాన్ని నడిపిస్తున్నారు.


అయితే అక్కడికి ప్యాంట్, షర్ట్ వేసుకున్న ఓ అమ్మాయి వచ్చింది. నేరుగా నిశ్చితార్థం జరుగుతున్న వేదిక వైపు స్పీడ్ వెళ్తోంది. ఆమెను చూసిన వారంతా తొలుత ఎంగేజ్మెంట్‌కు వచ్చిన బంధువుల అమ్మాయిగా భావించారు. కానీ, సదరు యువతి మాత్రం ఒక్కసారిగా స్జేజ్ మీదకు దూసుకెళ్లే సరికే అంతా ఆశ్చర్యపోయారు. వ్యవహారం ఏదో తేడాగా ఉందే అని అనుకున్నారు. పెళ్లి కుమారుడు ఆమెను ప్రేమించి మోసం చేశాడేమో అని అంతా భావించారు. తీరా.. సదరు యువతి పెళ్లికుమార్తె వద్దకు వెళ్లే సరికే ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. వధువును పీట్ల పైనుంచి లేపింది ఆ యువతి. ఆమెకు పెళ్లి కుమార్తె సర్దిచెప్పే ప్రయత్నం చేయగా మాట వినేందుకు నిరాకరించింది.


వధువు బ్రతిమిలాడుతున్నా వినకుండా ఆమెను తీసుకెళ్లే ప్రయత్నం చేసింది సదరు యువతి. దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అనంతరం ఇరుకుటుంబాల పెద్దలంతా స్జేజ్ పైకి వెళ్లారు. పెళ్లికుమార్తె, తాను ప్రేమించుకున్నామని తనను వదిలేసి మరో వ్యక్తిని వివాహం చేసుకునేందుకు చూస్తోందని గొడవకు వచ్చిన అమ్మాయి బాంబు పేల్చింది. ఇద్దరం నాలుగేళ్లపాటు సహజీవనం చేశామని చెప్పడంతో అంతా నోరెళ్లబెట్టారు. అయితే వధువు తరఫు బంధువులు ఆ అమ్మాయిని తీవ్రంగా కొట్టారు. స్జేజ్ మీద నుంచి కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లారు. వధువు స్వలింగ సంపర్కురాలు కావడంతో పెళ్లికి వరుడు, కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో నిశ్చితార్థం ఆగిపోయింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. వీటిని సోషల్ మీడియాలో పోస్టు చేయగా తెగ వైరల్‌గా మారాయి.


ఇవీ చదవండి:

వేప చెట్టు నుండి పాలు కారుతున్నాయోచ్..

పిల్లిలో తల్లి ప్రేమ.. పిల్లలను ఆడించడానికి ఎంత కష్టపడిందో చూస్తే..

Updated Date - Mar 06 , 2025 | 03:33 PM