కుమరం భీంను స్ఫూర్తిగా తీసుకోవాలి : ఎమ్మెల్యే ఆత్రం సక్కు
ABN , First Publish Date - 2022-10-17T03:19:25+05:30 IST
ఆదివాసీల ఆరాధ్యదైవం, పోరాటవీరుడు కుమరంభీంను ప్రతి ఒక్కరూస్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 16: ఆదివాసీల ఆరాధ్యదైవం, పోరాటవీరుడు కుమరంభీంను ప్రతి ఒక్కరూస్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదివారం మోవాడలో భీంవర్ధంతి వారోత్సవా ల్లోభాగంగా భీంవిగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ విద్య తోనే ఆదివాసీల అభివృద్ధి అని, ప్రతిఒక్కరూ విద్యపై దృష్టి సారించాలన్నారు. చంద్రాపూర్ గోండ్ రాజవంశ స్తుడు ఆత్రం చంద్రషా, సింగి ల్‌విండో చైర్మన్ అలీబీన్ అహ్మద్, భగవంతరావు, సర్పంచ్ కౌసల్య పాల్గొన్నారు.