ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MP Arvind: సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే

ABN, First Publish Date - 2022-11-17T14:11:47+05:30

దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: దేశంలోనే సిల్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ (KCR) మిగిలిపోయారని ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ (Telangana CM)వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ స్వయంగా అంధకారంలోకి నెట్టి వేస్తున్నారని ఆరోపించారు. పవర్ సెక్టార్‌ను గాలికొదిలేసి పాలకులు గంజా, డ్రగ్స్ పార్టీల్లో బిజీగా ఉన్నారన్నారు. బిడ్డ బ్యూటీ పార్లర్ మీద సంపాదించిన డబ్బుతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు కేసీఆర్ ఫీలవుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు.

దేశంలోనే అత్యధికంగా యూనిట్ విద్యుత్‌కు 9.50 రూపాయలు వసూలు చేస్తోన్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. తెలంగాణ వస్తే.. పది కొత్త ధర్మల్ ఫ్లాంట్స్ ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు లిక్కర్ స్కాం పార్టనర్స్ అని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్స్ కరెంటు బిల్లులు కట్టేందుకు సరిపోవటంలేదని తెలిపారు. విద్యుత్ శాఖలో ఖాళీలను ఎప్పుడు భర్తీ చేస్తారలో చెప్పాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ (BJP MP) డిమాండ్ చేశారు.

Updated Date - 2022-11-17T14:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising