Double decker buses: త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు
ABN , First Publish Date - 2022-11-04T11:42:07+05:30 IST
నగరానికి త్వరలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ర్టికల్ డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు

హైదరాబాద్ సిటీ: నగరానికి త్వరలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. ఎలక్ర్టికల్ డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు టెండర్లను ఆహ్వానించింది. అద్దె ప్రాతిపదికన బస్సులను నడిపించేందుకు ఆసక్తిగల కంపెనీల నుంచి బిడ్లను కోరుతోంది. డబుల్ డెక్కర్ బస్సులను ఏ రూట్లలో నడపాలనేది అధికారులు పరిశీలిస్తున్నారు. పటాన్‌చెరు-కోఠి, జీడిమెట్ల-సీబీఎస్, అప్జల్‌గంజ్-మెహిదీపట్నం మార్గాల్లో నడిపించేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు డబుల్ డెక్కర్ బస్సు ఫొటోలను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గురువారం ట్విటర్‌లో పోస్టు చేశారు.