Haryana Governor: కైకాలతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్న బండారు దత్తాత్రేయ
ABN, First Publish Date - 2022-12-23T12:52:57+05:30
సీనియర్ నటులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
హైదరాబాద్: సీనియర్ నటులు, మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana)మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ Haryana Governor Bandaru Dattatreya)తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కైకాల సత్యనారాయణ తెలుగు సినీ పరిశ్రమలో అనేక పాత్రలు పోషించి, సుమారు 750 చలన చిత్రాలలో నటించి నట సార్వభౌమగా తెలుగు ప్రజల హృదయాలను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. ఆయన గంభీరమైనటువంటి వ్యక్తిత్వంతో, మంచి హాస్యము, చతురతతో కూడుకున్న నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనదంటూ ఒక స్థానాన్ని నిలుపుకున్నారని కొనియాడారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కైకాల తనను కలిసి పలుమార్లు సినీ పరిశ్రమ సమస్యలపై, ప్రజా సమస్యలపై చర్చించేవారంటూ కైకాలతో ఉన్న సాన్నిహిత్యాన్ని హరియాణా గవర్నర్ గుర్తుచేసుకున్నారు. కైకాల ఆత్మకు శాంతి చేకూరాలని ...ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బండారు దత్తాత్రేయ తెలిపారు.
Updated Date - 2022-12-23T12:54:37+05:30 IST