ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Talasani Srinivas: మూడుతరాలకు గుర్తుండే గొప్ప నటుడు కైకాల

ABN, First Publish Date - 2022-12-23T12:33:28+05:30

విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ మూడుతరాల ప్రజలకు గుర్తుండే గొప్ప నటుడని సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ (Senior Actor Kaikala Satyanarayana) మూడుతరాల ప్రజలకు గుర్తుండే గొప్ప నటుడని సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. నవరస నట సార్వభౌముడు కైకాల అని.. విలక్షణ పాత్రల్లో సుమారు 700లకు పైగా సినిమాల్లో నటించిన ఏకైక వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం సమాజానికే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆవేదన చెందారు. మచిలీపట్నం నుంచి ఆయన ఎంపీగా ప్రాతినిథ్యం వహించారన్నారు. ఎన్టీఆర్‌ కూడా కైకాల సత్యనారాయణను ఇష్టపడే వారని మంత్రి గుర్తుచేశారు.

ఆనాటి సినిమాల్లో అగ్ర నటులు నటించే ఏ సినిమాల్లో అయిన కైకాల ఉండాల్సిందే అని అన్నారు. ఆయన చేసిన అన్ని పాత్రలో ఒదిగిపోయారన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి మరణం బాధాకరమని తెలిపారు. కైకాల మన మధ్య లేకపోయినా చరిత్రలో నిలిచిపోయే మనిషి అని అన్నారు. ఆయన కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు వస్తారు కాబట్టి వారికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-23T12:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising