Modi: నవంబర్ 12న తెలంగాణకు ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-10-30T15:57:20+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) నవంబర్ 12న తెలంగాణ (Telangana)కు రానున్నారు.

Modi: నవంబర్ 12న తెలంగాణకు ప్రధాని మోదీ

ఢిల్లీ (Delhi): ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) నవంబర్ 12న తెలంగాణ (Telangana)కు రానున్నారు. ఈ సందర్భంగా రామగుండం (Ramagundam) ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్నారు. రూ. 6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది. గత ఏడాది మార్చ్‌లోనే ఉత్పత్తి ప్రారంభమైంది. ఇప్పుడు నరేంద్ర మోదీ అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ఎరువుల శాఖ అధికారులు రామగుండం పోలీసులు కమిషనర్‌, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌తో ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో హెలిప్యాడ్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Updated Date - 2022-10-30T15:57:24+05:30 IST