ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BRS: రేపు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపు

ABN, First Publish Date - 2022-12-22T12:31:30+05:30

తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు బీఆర్‌ఎస్ (BRS)పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని ఉపాధి హామీ పనులపై కేంద్ర దుష్ప్రచారానికి వ్యతిరేకంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలు చేయాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (BRS Working President, Minister KTR) పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పంట కల్లాలను కడితే.. కేంద్రానికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నదాతకోసం కల్లాలు నిర్మిస్తే... మోడీ సర్కారు కళ్ళలో నిప్పులు పోసుకుంటోందని అన్నారు. ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉండే వ్యవసాయ కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మంత్రి ఆరోపించారు.

రైతులకు కలుగుతున్న ప్రయోజనాన్ని పట్టించుకోకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని (Telangana Government) బద్నాం చేసే పనిలో బీజేపీ ఉందన్నారు. చేపలు ఆరబెట్టుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో కల్లాలు నిర్మిస్తే అభ్యంతరం చెప్పలేదని... తెలంగాణ రైతులు కట్టుకున్న కల్లాలకు మాత్రమే కేంద్రం ఎందుకు వ్యతిరేకిస్తోందని నిలదీశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధించాలని తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ తరపున ఎన్నో ఏండ్ల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. రైతులకు, వ్యవసాయానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే తమ సూచనలను కేంద్రం పట్టించుకోకుండా.. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చే కుట్రలు కొనసాగిస్తోందని విమర్శించారు. వ్యవసాయ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని తెలిపారు. తెలంగాణ రైతుల ప్రగతిని ఓర్వలేకనే కేంద్రం కక్ష కట్టిందని వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ మతిలేని, కుట్రపూరిత చర్యలపై రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

Updated Date - 2022-12-22T12:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising