ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: మత్స్యకార సంఘాలు చేప పిల్లల పంపిణీకి పనికిరావా?

ABN, First Publish Date - 2022-11-21T14:46:45+05:30

మత్స్యకారుల దినోత్సవం సంధర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మత్స్యకారుల దినోత్సవం సంధర్భంగా గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Redd) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ సామాజిక వర్గాల వారు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్ తెలంగాణ (Telangana) ఇచ్చిందని తెలిపారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో కులవృత్తులు పూర్తిగా నిర్వీర్యమయ్యాయన్నారు. మత్స్యకార సంఘాలు చేప పిల్లల పంపిణీకి పనికిరావా? అని ప్రశ్నిస్తూ...చేప పిల్లల పంపిణీని ఆంధ్రా కాంట్రాక్టర్లకు అప్పగిస్తోందని మండిపడ్డారు. నాసిరకం చేప పిల్లలు పంపిణీ చేసి కొందరు పెద్దలు దోచుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై ప్రభుత్వం విచారణ చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు అందించినట్లే మత్య్సకారులకు కూడా 5 లక్షల బీమా పథకం అమలు చేయాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత్య్సకారులను బీసీ డి నుంచి బీసీ ఏ గ్రూపులో చేర్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారుల సంక్షేమంపై సూచనలు ఇస్తే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. మత్స్యకారులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి (TPCC Chief) స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-21T14:46:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising