Pilot Rohith Reddy: అయ్యప్ప దీక్ష వేసుకొని నేను ప్రమాణం చేస్తున్నా
ABN, First Publish Date - 2022-12-17T11:28:51+05:30
ఈడీ నోటీసులకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు.
హైదరాబాద్: ఈడీ నోటీసులకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (BJP State President Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి (TRS MLA Pilot Rohith Reddy)సవాల్ విసిరారు. శనివారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే.. పూజలు చేసి అమ్మవారి సాక్షిగా సవాల్ చేశారు. బండి సంజయ్ తడి బట్టలతో రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు రావాలన్నారు. ‘‘నాకు డ్రగ్స్ కేసులో నొటీసులు వచ్చినట్లు చూపించు. బండి సంజయ్‌కు తంబాకు వల్ల నోరు తిరుగతలేదు. మాకు ఈడీ నోటీసులు వస్తాయని బీజేపికి ముందే ఎలా తెలుసు. బీజేపీకి అబద్దాలు చెప్పడం కామన్‌గా మారింది. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుంది. నాకు కర్ణాటక పోలీసుల నుంచి నోటీసులు వస్తే అమ్మవారి సాక్షిగా బీజేపీ చూపించాలి. అయ్యప్ప దీక్ష వేసుకొని నేను ప్రమాణం చేస్తున్న. నాకు కర్ణాటక నుంచి ఎటువంటి నోటీసు రాలేదు. డ్రగ్స్ కేసుల్లో ఎఫ్ఐఆర్ లో ఎక్కడా నా పేరు లేదు. బండి సంజయ్ నిజంగా హిందు వాది అయితే రేపు భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు ఆదారలతో రావాలి. నాకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చాయని చెప్తున్న బీజేపీ ఆధారాలు చూపించాలి. నాకు సోమవారం ఈడీ ఆఫీస్‌కు రావాలని ఈడీ నోటీస్ ఇచ్చారు. నా బయోడేటా కోసమే ఈడీ నోటీసు ఇచ్చింది. రేపు బండి సంజయ్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంకు రాకపోతే... మొన్నటి దొంగస్వాములకు నీకు తేడా ఉండదు. ఎమ్మెల్సీ కవితకు కూడా నోటీసులు వస్తాయని బీజేపీ ముందే ఎలా చెప్పింది’’ అంటూ పైలట్ రోహిత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Updated Date - 2022-12-17T11:28:52+05:30 IST