Kavita Tweet: షర్మిలపై కవిత సెటైర్లు

ABN, First Publish Date - 2022-11-30T10:37:24+05:30

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు.

Kavita Tweet: షర్మిలపై కవిత సెటైర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila)పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (TRS MLC Kavita) ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు. ‘‘తాము వొదిలిన బాణం. తానా అంటే తందానా అంటున్న తామర పూలు’’ అంటూ షర్మిల, బీజేపీని ఉద్దేశిస్తూ కవిత ట్వీట్ చేశారు.

కాగా... నిన్న ప్రగతిభవన్ వద్ద హైడ్రామా నెలకొన్న విషయం తెలిసిందే. పాదయాత్రలో ధ్వంసమైన కారులోనే ప్రగతిభవన్‌ ముట్టడికి బయలుదేరిన షర్మిలను పోలీసులు సోమాజీగూడలో అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో షర్మిల వాగ్వాదానికి దిగారు. డోర్‌ లాక్‌ చేసుకుని కారులోనే ఉండిపోయారు. ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు క్రేన్ సాయంతో షర్మిల కారును లిఫ్ట్‌ చేసి ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ బలవంతంగా కారు డోర్లు తెరిచి వైఎస్సార్టీపీ అధినేత్రిని స్టేషన్‌ లోపలికి తీసుకెళ్లారు. షర్మిల అరెస్ట్‌ను నిరసిస్తూ వైఎస్సార్టీపీ కార్యకర్తలు భవనంపైకి ఎక్కి నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు షర్మిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆమెకు బెయిలు మంజూరు చేశారు.

Updated Date - 2022-11-30T10:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising