ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IT Rides: వంశీరామ్ బిల్డర్స్ తనిఖీల్లో కీలక ఆధారాలు లభ్యం!

ABN, First Publish Date - 2022-12-06T11:50:11+05:30

చేవెళ్లలో 250 ఎకరాల ఫామ్ లాండ్ విక్రయించింది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్ట్స్‌తో పాటు గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్స్ వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు వేల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వంశీరామ్ బిల్డర్స్ భారీగా లాభాలు ఆర్జించినట్లుగా తెలుస్తోంది. లాభాలు

కీలక ఆధారాలు లభ్యం!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ(Income Tax Department officials) అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. వంశీరామ్ బిల్డర్స్ ప్రధాన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ ఇళ్లల్లో ఐటీ ఆఫీసర్స్ దాడులు కొనసాగిస్తున్నారు. నందగిరి హిల్స్‌లోని వంశీరామ్ బిల్డర్ చైర్మన్ సుబ్బారెడ్డి నివాసంలోనూ తనిఖీలు సాగుతున్నాయి. పెద్దమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్న కార్పొరేట్ కార్యాలయంలో.. అలాగే జూబ్లీహిల్స్‌లోని సుబ్బారెడ్డి బావబారిది జనార్ధన్‌రెడ్డి నివాసంలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా 15 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు.

గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వంశీరామ్ బిల్డర్స్ నిర్మాణ రంగంలో ఉంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో వంశీరామ్ బిల్డర్స్ 85 ప్రాజెక్టులు పూర్తి చేసింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఏడు భారీ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతోంది. చేవెళ్లలో 250 ఎకరాల ఫామ్ లాండ్ విక్రయించింది. అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్ట్స్‌తో పాటు గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్స్ వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు వేల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. వంశీరామ్ బిల్డర్స్ భారీగా లాభాలు ఆర్జించినట్లుగా తెలుస్తోంది. లాభాలు తక్కువగా చూపి పన్ను ఎగవేతకు పాల్పడ్డారని ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన లాభాలను తక్కువగా చూపి ఆ నిధులను ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టరాని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉదయం ఆరున్నర గంటలకు 15 చోట్ల ఏకకాలంలో సోదాలు ప్రారంభించింది. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ నేతల ఇళ్లల్లోనూ దాడులు..

హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వెళ్లిన ఐటీ అధికారులు విజయవాడలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్(Devineni Avinash), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(MLA Vallabhaneni Vamsi) ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వంశీరామ్ బిల్డర్స్‌పై తనిఖీల్లో భాగంగానే వైసీపీ నేతల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో వైసీపీ నేత దేవినేని అవినాష్‌కు చెందిన స్థలం డెవలప్‌మెంట్ కోసం వంశీరామ్ బిల్డర్స్ తీసుకుంది. ఒప్పందంలో భాగంగా జరిగిన లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం అందుతోంది.

గత నెలలో హైదరాబాద్‌లోని మంత్రి మల్లారెడ్డి ఇళ్లతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో రెండు రోజుల పాటు ఐటీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం సీజ్ చేసింది. విచారణకు రావాల్సిందిగా మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులుకు నోటీసులు జారీ చేసింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు కలకలం సృష్టించగా.. తాజాగా ఆదాయపు పన్నుశాఖ అధికారులు కూడా తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహించడం ఆసక్తి రేపుతోంది. కొన్ని రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-12-06T11:50:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising