ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Congress leader: కవితపై జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2022-11-19T12:15:16+05:30

టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(MLC Jeevan Reddy) కూడా.. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(mlc kavitha)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కవితకు

కీలక వ్యాఖ్యలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల: టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి(MLC Jeevan Reddy) కూడా.. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత(mlc kavitha)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో కవితకు వెన్నుపోటు పొడిచింది సొంతపార్టీ ఎమ్మెల్యేలేనని వ్యాఖ్యానించారు. కవిత గెలిస్తే ఆధిపత్యం చేలాయిస్తుందేమోనన్న భయంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఆమెను ఓడించారని ఆరోపించారు. కవితను కనపడకుండా చేయాలని చూసింది ఆ పార్టీ ఎమ్మెల్యేలేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఎంపీని కూడా గెలిపించుకోలేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు వచ్చిన ఓట్లు కవితకు ఎందుకు పడలేదని ప్రశ్నించారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో రైతులతో నిజామాబాద్‌లో నామినేషన్ వేయించింది బీజేపీనేనని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ నామినేషన్ వేయిస్తే.. వాళ్లు బీజేపీలో ఎందుకు చేరుతారని జీవన్‌రెడ్డి నిలదీశారు.

ఎంపీ అరవింద్ కూడా అవే వ్యాఖ్యలు..

హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయం వేడెక్కింది. దాడిపై ఎంపీ అరవింద్ స్పందిస్తూ.. ఎమ్మెల్సీ కవిత ప్రెస్‌మీట్‌లో పక్కనకూర్చున్న ఎమ్మెల్యేలే ఆమెను ఓడగొట్టారని అరవింద్ కూడా ఆరోపించారు.

Updated Date - 2022-11-19T12:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising