గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్
ABN , First Publish Date - 2022-08-04T09:38:11+05:30 IST
త్వరలో గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని, ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదు
- కొత్త ఫించన్లు, రేషన్ కార్డులు కూడా..
- వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
మేడ్చల్, రామచంద్రాపురం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి) : త్వరలో గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని, ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ బలోపేతం చేస్తున్నామని చెప్పారు. బుధవారం ఆయన మేడ్చల్‌లో రూ.7.50 కోట్లతో నిర్మించనున్న 50 పడకల మాతాశిశు ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే, సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో రూ.22.7 కోట్లతో ఆఽధునీకరించిన వంద పడకల ఈఎ్‌సఐ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కోసం మేడ్చల్‌లో నిర్మించనున్న ఈ ఆస్పత్రిని 8- 10 నెలల్లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. మేడ్చల్ జిల్లాలో త్వరలోనే 13 బస్తీ దవాౄఖానాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఇప్పటికే హైదరాబాద్ జంట నగరాల్లో 350 బస్తీ దౄవాఖానాలు ఏర్పాటు చేౄశామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ కాన్పులు చేసేందుకు వైద్యులకు, సిబ్బందికి నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 30 లక్షల మందికి ఫించన్లు అందజేస్తున్నామని, త్వరలో 57 ఏళ్లు నిండిన మరో 8-10 లక్షల మందికి కొత్తగా ఫించన్లు అందించనున్నట్లు మంత్రి హరీశ్ తెలిపారు. వీటితో పాటు కొత్త రేషన్ కార్డులను అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రూ.4 వేల కోట్లతో శంషాబాద్‌లో కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని, పటాన్‌చెరులో 100 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. నాచారం ఈఎ్‌సఐ ఆస్పత్రిని రూ.200 కోట్లతో ఆధునీకరించనున్నట్లు తెలిపారు.
బీబీనగర్ ఎయిమ్స్ ప్రతిష్ఠను దిగజార్చింది బీజేపీనే
బీబీనగర్ ఎయిమ్స్ ప్రతిష్ఠను బీజేపీనే దిగజార్చిందని మంత్రి హరీశ్ రావు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఎయిమ్స్‌లో సౌకర్యాలు లేకపోవడంతో.. ఒక్క కాన్పు కూడా జరుగలేదని, ఎయిమ్స్‌లో చేరిన విద్యార్థులు బాదపడుతున్నారని అన్నారు. కేంద్రమంత్రి షెకావత్ 5 నెలల కిందట ౄసాక్షాౄత్తు పార్లమెంటులో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని ప్రకటించి, ఇప్పుడు అనుమతులు లేవని చెప్పడం హాస్యాౄస్పదమన్నారు. బీజేపీ వాళ్లది నోరా? లేక మోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరానికి సంబంధించిన కేంద్రం అనుమతుల పత్రాలను మంత్రి సమావేశంలో చూపించారు.