రాజీకి చక్కని మార్గం లోక్ అదాలత్
ABN , First Publish Date - 2022-11-05T23:18:31+05:30 IST
న్యాయస్థానాల వెలుపల వివాదాలను, అభ్యంతరాలను రాజీ మార్గంతో పరిష్కరించడానికి లోక్‌అదాలత్ ఎంతో దోహదం చేస్తుందని సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి పేర్కొన్నారు.

- సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి
అడ్డాకుల, నవంబరు 5 : న్యాయస్థానాల వెలుపల వివాదాలను, అభ్యంతరాలను రాజీ మార్గంతో పరిష్కరించడానికి లోక్‌అదాలత్ ఎంతో దోహదం చేస్తుందని సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని కందూరు గ్రామ పంచాయ తీలో లోక్‌అదాలత్ నిర్వహించి, ‘న్యాయవ్యవస్థ, చట్టాలు’ అనే అంశంపై అవగాహన సదస్సులో మాట్లాడారు. చిన్నచిన్న సంఘటనలతో కేసులు వేసుకుంటే కాలయాపనతోపాటు ఆర్థికంగా కూడా నష్టపోతారని అన్నారు. రాజీతో లోక్‌అదాలత్ ద్వారా ముందుకు వెళితే మంచిదని సూచించారు. అంతకు ముందు ఆమె కుటుంబ సభ్యులతో కందూరు రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్, సర్పంచు శ్రీకాంత్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌గ