ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

munugode bypoll: మద్యం సీసాల దిబ్బగా మునుగోడు..

ABN, First Publish Date - 2022-11-02T18:02:08+05:30

munugode election : రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక రానే వచ్చింది. ఇన్నాళ్లూ ఓటరు దేవుళ్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పోటాపోటీ ప్రచారం చేయడంతో పాటూ మరోవైపు ఓటర్లను డబ్బు, మద్యం పంపిణీ తదితర మార్గాల ద్వారా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

munugode election : రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక రానే వచ్చింది. ఇన్నాళ్లూ ఓటరు దేవుళ్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పోటాపోటీ ప్రచారం చేయడంతో పాటూ మరోవైపు ఓటర్లను డబ్బు, మద్యం పంపిణీ తదితర మార్గాల ద్వారా తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు జోరుగా సాగాయి. ఒక్కో ఓటుకు రూ.10వేలకు పైగా పంపిణీ చేసేందుకు కూడా వెనుకాడలేదు. ఇక మద్యం విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉప ఎన్నిక ప్రచారం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకూ కోట్ల రూపాయల మేర విక్రయాలు జరిగాయి. నియోజకవర్గ వ్యాప్తంగా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన మద్యం సీసాలే ఇందుకు నిదర్శనం.

ఇప్పటి వరకు అత్యంత ఖరీదైనదిగా చెబుతున్న మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా.. ఓటర్లను ఆకట్టకునేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు డబ్బులతో పాటూ మద్యం సీసాలను ఎరగా వేస్తున్నారు. మరోవైపు మందుబాబులు కూడా ఇదే మంచి తరుణం అన్నట్లు.. మా ఓటు మీకే అంటూ.. తమకు ఖరీదైన బ్రాండ్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఓటర్లు అడగడమే ఆలస్యం అన్నట్లుగా.. అభ్యర్థులు కూడా ఖర్చుకు వెనుకాడడం లేదు. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ చూసినా మద్యం సీసాలు గుట్టలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి.

ఇప్పటి వరకూ సుమారు రూ.160కోట్లకు పైగా మద్యం విక్రయాలు (Liquor sales) జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఎన్నికలు ముగిసేనాటికి రూ.200కోట్లకు పైగా విక్రయాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా రూ.132కోట్ల మేర విక్రయాలు జరిగితే.. మునుగోడు ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఉండే ఓటర్లతో పాటూ హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లతో కలుపుకొని.. ఒక్క నెలలో సుమారు రూ.300కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. నియోజవర్గ పరిధిలో మొత్తం 28 మద్యం దుకాణాలు ఉండగా.. మునుగోడులో అత్యధింకంగా, గట్టుప్పల్‌లో అత్యల్పంగా మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2022-11-02T18:31:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising