New Year celebrations: న్యూఇయర్ వేళ.. పబ్స్ నిర్వాహకులకు హైకోర్టు షాక్.. ఇక ఆ పప్పులు ఉడకవ్..

ABN, First Publish Date - 2022-12-30T18:25:30+05:30

నగరంలోని పబ్స్ (Pubs) నిర్వాహకులకు మరోసారి హైకోర్టు (High Court) షాక్ ఇచ్చింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని వెకేట్ పిటిషన్‌తో పబ్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ..

New Year celebrations: న్యూఇయర్ వేళ.. పబ్స్ నిర్వాహకులకు హైకోర్టు షాక్.. ఇక ఆ పప్పులు ఉడకవ్..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని పబ్స్ (Pubs) నిర్వాహకులకు మరోసారి హైకోర్టు (High Court) షాక్ ఇచ్చింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని వెకేట్ పిటిషన్‌తో పబ్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో మరో సారి పబ్ యాజమాన్యాలకు ఎదురు దెబ్బ తగిలింది. రాత్రి 10 గంటలు తర్వాత పబ్‌ల నుండి శబ్దాలు రాకూడదని, గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ, నిబంధనలు ఉల్లగించిన పబ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పది పబ్‌లపై ఆంక్షలు కొనసాగునున్నాయి.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని గతంలో 10 పబ్‌లపై హైకోర్టు ఆంక్షలు విధించింది. అయితే నూతన సంవత్సర వేడుకల (New Year celebrations) నేపథ్యంలో 10 పబ్‌ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఉన్న ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై మరోసారి హైకోర్టులో వాదనలు కొనసాగాయి. పబ్ యాజమాన్యాల వాదనలు విన్న తరువాత.. కోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 10 దాటితే పబ్స్‌లో ఎలాంటి సౌండ్ (Sounds) వినపడకూడదంటూ ఆదేశించింది. రాత్రి 10 నుండి తెల్లవారుజాము 6 వరకు ఎలాంటి సౌండ్స్, మైక్స్, లౌడ్ స్పీకర్ వంటి వాటికి అనుమతి రద్దు చేసింది. పగటి వేళల్లో సైతం సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ చట్ట ప్రకారం (Noise Pollution Regulation Act) లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే అనుమతి ఇవ్వాలని హైకోర్టు సూచించింది. రాత్రి వేళల్లో ఎటువంటి సౌండ్ సిస్టంకు అనుమతి లేదని తేల్చిచెప్పింది.

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో పబ్‌ల వ్యవహారంపై హైకోర్టులో ముందు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను పిటిషనర్లు ప్రస్తావించారు. కానీ ఇందుకు హైకోర్టు మాత్రం నో చెప్పింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న 10 పబ్‌లలో రాత్రి 10గంటల తర్వాత మ్యూజిక్ పెట్టరాదని చెప్పింది. ఈ 10 పబ్బుల్లో న్యూ ఇయర్ ఈవెంట్స్‌లోనూ 10 గంటల తర్వాత సౌండ్ పెట్టకూడదంటూ సూచించింది. జూబ్లిహిల్స్‌లో ఉన్న టాట్, జూబ్లీ 800, ఫర్జి కేఫ్, అమ్నిషియ, హై లైఫ్, డైలీడోస్, దర్టీ మార్టిన్ కిచన్, బ్రాడ్వే, మాకొబ్రీవ్, హార్ట్ కప్ పబ్‌లలో రాత్రి వేళల్లో ఎలాంటి శబ్ధాలూ వినపడకూడదని సూచించింది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం ఇళ్లు, విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్‌లకు అనుమతి ఉండదు. ఈ నేపథ్యంలో సదరు పబ్‌లకు అదే విదమైన ఆదేశాలు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు అంటేనే రాత్రి పది గంటల తరువాత మొదలవుతాయి. అయితే ప్రస్తుతం అనుమతి లేకపోవడంతో పబ్‌ల నిర్వాహకులు.. వేడుకలను పూర్తిగా రద్దు చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంగిస్తే కట్టిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.

Updated Date - 2022-12-30T18:25:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising