ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR: మళ్లీ మొహం చాటేస్తారా?

ABN, First Publish Date - 2022-12-20T16:41:27+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM K Chandrashekar Rao) మరోసారి మొహం చాటేస్తారా?

Telangana CM K Chandrashekar Rao
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM K Chandrashekar Rao) మరోసారి మొహం చాటేస్తారా? తాజా పరిస్థితులు చూస్తుంటే ఔననే అనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ (BJP) అధినాయకత్వంతో విభేదాలు మొదలైనప్పటినుంచీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) ని కలిసేందుకు కేసీఆర్ ఆసక్తి చూపడం లేదు. ప్రధాని అధికారిక పర్యటనల్లో భాగంగా రాష్ట్రానికి వచ్చినా కేసీఆర్ కలవడానికి ఇష్టపడలేదు. ప్రొటోకాల్ పాటించలేదు.

తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఈనెల 26న తెలంగాణకు తొలిసారి వస్తున్నారు. రాష్ట్రపతిగా ఎన్నికయ్యాక ఆమె తొలిసారిగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేస్తారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా ముర్ము అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రామప్ప, భద్రాచలం ఆలయాలను సందర్శించనున్నారు. శంషాబాద్‌ సమీపంలోని కన్హా ఆశ్రమంలో రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ముర్ము పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో ముర్ముతో పాటు కేసీఆర్ పాల్గొనకపోవచ్చని సమాచారం.

బీజేపీ బలపరిచిన ఎన్డీయే అభ్యర్ధి కావడంతో ఎన్నికల వేళ ముర్ముకు టీఆర్ఎస్ ఓటెయ్యలేదు. పైగా ఆసమయంలో ప్రచారానికి వచ్చిన యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు అపూర్వ స్వాగతం పలికారు. ఎంతలా అంటే హైదరాబాద్ నగరమంతటా యశ్వంత్ సిన్హాకు అనుకూలంగా ఫ్లెక్సీలు వెలిశాయి. టీఆర్ఎస్ శ్రేణులైతే ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా చేయనంత హడావుడి చేశాయి. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు యశ్వంత్‌కు అనుకూలంగా కిలోమీటర్ల కొద్దీ బైక్ ర్యాలీ చేపట్టారు.

నాటి రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము సంచలనం సృష్టించారు. ఆదివాసీ వర్గానికి చెంది అత్యున్నత పదవిని అధిష్టించిన తొలి మహిళగా రికార్డులకెక్కారు.

రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానిని కలవనట్లే రాష్ట్రపతిని కూడా కేసీఆర్ కలవకపోవచ్చని తెలుస్తోంది. సరిగ్గా ముర్ము తెలంగాణలో అడుగుపెట్టగానే భారత్ రాష్ట్ర సమితి పనుల్లో భాగంగా ఆయన హస్తినకు వెళ్తున్నారు. ముర్ము తెలంగాణ పర్యటన ముగిసేవరకూ కేసీఆర్ ఢిల్లీలోనే ఉంటారని సమాచారం. దీంతో కేసీఆర్ మరోమారు మొహం చాటేస్తారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-20T16:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising