లోన్‌యా్‌ప వేధింపులకు యువకుడి బలి
ABN , First Publish Date - 2022-11-08T01:06:57+05:30 IST
భర్త చనిపోవడంతో చేతికంది వచ్చిన కొడుకు తనను పోషిస్తాడని ఆ తల్లి భావించింది. కానీ లోన్ యాప్ నిర్వాహక వేధింపులతో చేతికందిన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన సంది స్వరూప-చొక్కారెడ్డిలకు కూతురు, కుమారుడు ఉన్నారు.

మల్లారంలో విషాదం
భీమదేవరపల్లి, నవంబరు 7: భర్త చనిపోవడంతో చేతికంది వచ్చిన కొడుకు తనను పోషిస్తాడని ఆ తల్లి భావించింది. కానీ లోన్ యాప్ నిర్వాహక వేధింపులతో చేతికందిన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామానికి చెందిన సంది స్వరూప-చొక్కారెడ్డిలకు కూతురు, కుమారుడు ఉన్నారు. మూడేళ్ల క్రితం చొక్కారెడ్డి మృతి చెందాడు. దీంతో కుమార్తె శ్రావణి వివాహం గత ఏడాది జరిపించారు. కుమారుడు శ్రావణ్‌రెడ్డి(24) హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కారు డ్రైవర్‌గా పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు. శ్రావణ్‌రెడ్డి ఆరు నెలల క్రితం ఓ లోన్ యాప్ ద్వా రా రూ. లక్ష వరకు రుణం తీసుకున్నాడు. అయితే లోన్ కిస్తీలు సక్రమంగా కట్టకపోవడంతో లోన్‌యా ప్ వేధింపులు మొదలయ్యాయి.
డబ్బులు మొత్తం చెల్లించకపోతే పరువు తీస్తామని, బంధువులకు ఫొటోలు షేర్ చేస్తామని నెలరోజులుగా నిర్వాహకులు బెదిరిస్తుండటంతో శ్రావణ్‌రెడి మానసికంగా వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం మాదాపూర్‌లోని ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలియక తల్లి స్వరూప కొడుకుకు ఫోన్ చేయగా ఎత్తలేదు. దీంతో ఆమె ఇంటి ఓనర్‌కు ఫోన్ చేసింది. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా శ్రావణ్‌రెడ్డి ఉరేసుకొని కనిపించాడు. వెంటనే వారు తల్లికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వచ్చిన ఆమె.. కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మల్లారం తీసుకువచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. శ్రావణ్‌రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మల్లారం సర్పంచ్ గుడెల్లి రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.