Holiday: ఏపీలో 13న ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సెలవు
ABN, First Publish Date - 2023-03-02T20:11:19+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) సందర్భంగా ఈనెల 13న ప్రభుత్వం సెలవు (Holiday) ప్రకటించింంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు (Guntur) జిల్లాలు మినహా అన్ని..
అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల (MLC election) సందర్భంగా ఈనెల 13న ప్రభుత్వం సెలవు (Holiday) ప్రకటించింంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు (Guntur) జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు ఏపీ సీఈఓ సెలవు ప్రకటించింది. ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. 8 స్థానిక సంస్థల్లోని 9 నియోజకవర్గాలు, మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదల చేసింది. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ (Polling) జరుగుతుంది. అదే నెల 16న ఓట్ల లెక్కించి.. ఫలితాలు ప్రకటిస్తారు. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఈ నియోజకవర్గాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
పదవీ విరమణ చేసేది వీరే..
స్థానిక సంస్థల కోటాలో నెల్లూరు-అనంతపురం ఎమ్మెల్సీ గునపాటి దీపక్‌రెడ్డి (టీడీపీ), కడప-బీటెక్ రవి (టీడీపీ) మార్చి 29న.. నెల్లూరు-వాకాటి నారాయణరెడ్డి (ప్రస్తుతం బీజేపీ), పశ్చిమ గోదావరి-అంగర రామ్మోహన్, మంతెన వెంకట సత్యనారాయణరాజు, తూర్పు గోదావరి-చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం-శత్రుచర్ల విజయరామరాజు, చిత్తూరు-బీఎన్ రాజసింహులు, కర్నూలు-కేఈ ప్రభాకర్ (అంతా టీడీపీ) మే 1న పదవీ విరమణ చేయనున్నారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి (పీడీఎఫ్), కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి (వైసీపీ), శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం పట్టభద్రుల ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ (బీజేపీ), ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం (పీడీఎఫ్), కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి మార్చి 29న రిటైర్ కానున్నారు.
Updated Date - 2023-03-02T20:11:19+05:30 IST