ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP MLC Results: పులివెందులలో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన ‘సైకిల్‌’

ABN, First Publish Date - 2023-03-18T18:08:21+05:30

ఉత్తరాంధ్రలో ఛీత్కారం ఎదురైంది. ‘ఇక్కడ మాకు తిరుగులేదు’ అనుకుంటున్న తూర్పు, పశ్చిమ రాయలసీమలోనూ అధికార వైసీపీకి చుక్కెదురైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం: అధికార వైసీపీకి రాయలసీమలో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం సొంత జిల్లా కడప గడప కలిసి ఉన్న పశ్చిమ సీమలోనూ టీడీపీ విజయం సాధించి... వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టింది. పశ్చిమ రాయలసీమ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumi Reddy Ramgopal Reddy) వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిపై 7,543 ఓట్ల మోజార్టీలో విజయం సాధించారు. పులివెందులలో 40 ఏళ్ల చరిత్రను సైకిల్‌ తిరగరాసింది. 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. రాయలసీమ తూర్పు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో (Rayalaseema East Graduate Constituency Election) టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ (TDP candidate Kancharla Srikanth), ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక (MLC election of Uttarandhra graduates)ల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు (TDP candidate Vepada Chirajeevi Rao) విజయదుందుభి మోగించారు. మొత్తం మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది.

రాయలసీమ జిల్లాలు, వాటిని ఆనుకుని ఉన్న నెల్లూరు, ప్రకాశం జిల్లాలు రాజకీయంగా తమకు బలమైన కోటలుగా వైసీపీ నాయకత్వం భావిస్తూ వస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో కొంత ఎదురు గాలి వీచినా రాయలసీమలో మాత్రం తమకు తిరుగుండదని ఇంతకాలం ఆ పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటూ వచ్చారు. పట్టభద్ర ఎన్నికలు ఆ అంచనాలను తలకిందులు చేశాయి. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు కలిపి ఉన్న రాయలసీమ తూర్పు పట్టభద్ర నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌ వైసీపీ అభ్యర్ధిపై భారీ ఆధిక్యం సాధించారు. చిత్తూరు, నెల్లూరులో తమకు ఎదురు లేదన్న నమ్మకంతో ఉన్న వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ ఫలితం షాకిచ్చింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసి ఉన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్ర నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా కలిసి ఉన్న చోట కూడా టీడీపీ విజయం సాధించడం గమనార్హం.

Updated Date - 2023-03-18T21:31:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising