ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP Leaders: సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతల బృందం

ABN, First Publish Date - 2023-10-18T11:16:09+05:30

రాష్ట్ర గవర్నర్ నజీర్‌ను టీడీపీ నేతల బృందం ఈరోజు(బుధవారం) సాయంత్రం కలువనుంది. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌, నాయకుల గృహనిర్బంధంతో పాటు చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్‌కు నేతలు వివరించనున్నారు.

అమరావతి: రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను (AP Governor Abdul Nazeer) టీడీపీ నేతల బృందం (TDP Leaders) ఈరోజు(బుధవారం) సాయంత్రం కలువనుంది. సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్‌ను కలవనున్న టీడీపీ నేతలు.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ (TDP Chief Chandrabab Arrest), నాయకుల గృహనిర్బంధం అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకురానున్నారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా గవర్నర్‌కు టీడీపీ నేతలు వివరించనున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ విషయంలో తొలిసారిగా గవర్నర్‌ను టీడీపీ నేతలు కలుస్తున్నారు. టీడీపీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు (AP TDP Chief Atchannaidu) ఆధ్వర్యంలో యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu), వర్లరామయ్య (Varla Ramaiah), గద్దె రామ్మోహన్ (Gadde Rammohan), బోండా ఉమా (Bonda Uma).. గవర్నర్‌ను కలువనున్నారు.


కాగా... రెండు రోజుల క్రితం మాజీ మంత్రి కొల్లు రవీంద్రను (Former Minister Kollu Ravindra) పోలీసులు అదుపులోకి తీసుకుని కృష్ణా జిల్లా వ్యాప్తంగా అనేక పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పి తిరిగి రాత్రి 11 గంటల సమయంలో ఇంటి వద్ద విడిచిపెట్టడం, నిన్న తల్లి వర్ధంతి కార్యక్రమానికి వెళ్లనీయకుండా కొల్లురవీంద్రను గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. పోలీసుల తీరుపై ఇప్పటికే హైకోర్టులో కొల్లు రవీంద్ర సతీమణి పేరిట హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. అలాగే ఈరోజు మాజీ మంత్రి దేవినేని ఉమాను (Former Minister Devineni Uma) గొల్లపూడిలోని ఆయన స్వగృహంలో నిర్బంధించారు. ఎక్కడికీ వెళ్లేందుకు వీలు లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల గృహనిర్బంధాలను గవర్నర్ దృష్టి తీసుకెళ్లాలని తెలుగుదేశం బృందం నిర్ణయించింది. అలాగే చంద్రబాబు అక్రమ అరెస్ట్.. తదనంతరం జరిగిన పరిణామాలను కూడా గవర్నర్‌కు వివరించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం గవర్నర్‌ను కలిసిన అనంతరం టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడనున్నారు.

Updated Date - 2023-10-18T11:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising