ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: ‘కోడికత్తి’లో కొత్త ట్విస్ట్‌

ABN, First Publish Date - 2023-04-10T20:44:02+05:30

సీఎం జగన్‌ (CM Jagan) ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖపట్నం విమానాశ్రయం (Visakhapatnam Airport)లో కోడికత్తితో జరిగిన హత్యాయత్నం కేసులో కొత్త మలుపు వచ్చి చేరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయవాడ: సీఎం జగన్‌ (CM Jagan) ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖపట్నం విమానాశ్రయం (Visakhapatnam Airport)లో కోడికత్తితో జరిగిన హత్యాయత్నం కేసులో కొత్త మలుపు వచ్చి చేరింది. జగన్‌ విచారణకు హాజరుకావాల్సిందేనని విజయవాడలోని ఎన్‌ఐఏ న్యాయస్థానం (NIA court) కొద్దిరోజుల క్రితం సమన్లు జారీచేసింది. వాస్తవానికి సోమవారం జరిగిన విచారణకు హాజరుకావాల్సి ఉన్నది. ఈ కేసులో కొంతమంది సాక్షులను విచారించిన తర్వాత వైసీపీ లీగల్‌ సెల్‌ జగన్‌ తరపున రెండు పిటిషన్లను దాఖలు చేసింది. కేసులో దర్యాప్తు సమగ్రంగా జరగలేదని, ఈ దర్యాప్తును మరింత సమగ్రంగా చేయాలని ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ (investigation)లో జగన్‌కు వ్యక్తిగత హాజరును మినహాయింపు ఇవ్వాలని మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లను వైసీపీ లీగల్‌ సెల్‌ ప్రతినిధి ఇంకొల్లు వెంకటేశ్వర్లు దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లపై విచారణను న్యాయమూర్తి శ్రీనివాస ఆంజనేయమూర్తి ఈనెల 13వ తేదీకి వాయిదా వేశారు.

మళ్లీ కొత్త షెడ్యూల్‌

కోడికత్తి కేసును విచారించడానికి ఎన్‌ఐఏ న్యాయస్థానం రెండు నెలల క్రితం ట్రయల్‌ షెడ్యూల్‌ (Trial schedule)ను ప్రకటించింది. ఇందులో భాగంగానే సాక్షులను విచారిస్తోంది. ప్రస్తుతం విమానాశ్రయం సీఐఎస్‌ఎఫ్‌ కమాండెంట్‌ దినేష్‌ కుమార్‌ను విచారించారు. బాధితుడిగా ఉన్న జగన్‌, ఆయన వ్యక్తిగత సహాయకుడు కె.నాగేశ్వరరెడ్డిని హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. వారిలో నాగేశ్వరరెడ్డి కోర్టుకు సోమవారం హాజరైనప్పటికి విచారణ జరగలేదు. ఇదే సమయంలో వైసీపీ లీగల్‌ సెల్‌ కొత్తగా రెండు పిటిషన్లను దాఖలు చేసింది. దీంతో న్యాయమూర్తి ప్రస్తుతం ఉన్న షెడ్యూల్‌ స్థానంలో కొత్త షెడ్యూల్‌ ఇస్తామని ప్రకటించారు.

రావాలి జగన్‌... చెప్పాలి సాక్ష్యం : సలీం, న్యాయవాది

జగన్‌ కోర్టుకు హాజరుకావాల్సిందే. జగన్‌ రావాలి, సాక్ష్యం చెప్పాలి. జగనన్న మా భవిష్యత్తు అంటున్నారు. మరి ఆయనకు దళిత యువకుడి భవిష్యత్తు పట్టదా? నాలుగున్నరేళ్లుగా నిందితుడు శ్రీనివాసరావు జైల్లో ఉంటున్నాడు. అతడి భవిష్యత్తు గురించి జగన్‌ ఆలోచించాలి. జగన్‌కు తగిలింది పెద్ద గాయమేమీ కాదు. ఏం జరిగిందో చెప్పడానికి జగన్‌ కోర్టుకు రావడానికి ఇబ్బంది ఏముంది?

Updated Date - 2023-04-10T20:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising