ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ACB: బెజవాడలో వరుస ఏసీబీ సోదాలు

ABN, First Publish Date - 2023-05-03T21:08:07+05:30

విజయవాడ (Vijayawada)లో వరుసగా ఏసీబీ సోదాలు (ACB searches) జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం మొదలైన సోదాలు బుధవారం మరింత పెరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విజయవాడ (Vijayawada)లో వరుసగా ఏసీబీ సోదాలు (ACB searches) జరుగుతున్నాయి. మంగళవారం సాయంత్రం మొదలైన సోదాలు బుధవారం మరింత పెరిగాయి. విజయవాడ పటమట సబ్‌రిజిస్ట్రార్‌ అజ్జా రాఘవరావు ఇంట్లో బుధవారం సాయంత్రం వరకు దాడులు కొనసాగాయి. దీనితోపాటు మంగళగిరి (Mangalagiri)లో ఉన్న ఆయన బంధువుల ఇళ్లలోనూ బృందాలు సోదాలు నిర్వహించాయి. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల వరకు తనిఖీలు జరిగాయి. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న వాసా నగేష్‌ ఇంట్లో ఏలూరు ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. లోగడ ఆయన ద్వారకా తిరుమల దేవస్థానంలో సూపరింటెండ్‌గా విధులు నిర్వర్తించారు. అక్కడ ఆయన ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టుకున్నారని పలు ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఆయన విజయవాడ భవానీపురంలోని లోటస్‌ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. ఒక బృందం విజయవాడలో సోదాలు నిర్వహించగా, ద్వారకా తిరుమల, నిడదవోలు, భీమడోలు, దుర్గామల్లేశ్వరస్వామి ఏవో కార్యాలయంలో కొన్ని బృందాలు తనిఖీ చేశాయి. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పటమట సబ్‌రిజిస్ట్రార్‌ రాఘవరావు కొద్దిరోజుల క్రితం గాంధీనగరంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు అక్కడా తనిఖీలు చేశారు.

నిడదవోలులో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిఉన్నారన్న సమాచారం మేరకు బుధవారం తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) నిడదవోలు పట్టణానికి చెందిన వాసా నగేష్‌ సోదరుడైన సురేష్‌ ఇంట్లో బుధవారం సోదాలు నిర్వహించారు. వాసా నగేష్‌ గతంలో ద్వారకాతిరుమల ఆలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేశారని ప్రస్తుతం విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌కు అందిన సమాచారం మేరకు బుధవారం నగేష్‌ సోదరుడు ఇంట్లో తనిఖీలు చేశామని.. ఉన్నతాధికారులకు వివరాల నివేదిక అందిస్తామని తెలిపారు.

Updated Date - 2023-05-03T21:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising