ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Palle Raghunathreddy: సాక్షిలో నాపై వికృత రాతలు.. క్షమాపణ చెప్పకపోతే..

ABN, First Publish Date - 2023-08-22T12:40:41+05:30

సాక్షిలో తన మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అనంతపురం: సాక్షిలో తన మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారంటూ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి (Former Minister Palle Raghunath Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీనిపై నిజానిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చనిపోయిన నా భార్య ఆస్థులు నా పేరుపై మార్పించుకునేందుకు లంచం ఇచ్చాను అని రాశారు. మ్యుటేషన్ కోసం ఓ వెయ్యి రూపాయల ఫీజు చెల్లించా. దానిని సాక్షి దినపత్రికలో వికృత రాతలు రాశారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డికి (Kadiri MLA Siddarth Reddy) కనీసం ఇంగిత జ్ఞానం లేదన్నారు. తాను వైసీపీ నాయకుల మాదిరి బిల్డర్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయనన్నారు. తన జోలికి వస్తే వైసీపీ నాయుకులు భస్మం అవుతారని హెచ్చరించారు. ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కుంటానని తెలిపారు. దమ్ము ఉంటే తన మీద దర్యాప్తు చేయాలని సవాల్ విసిరారు. సాక్షి పత్రిక క్షమాపణ చెప్పకపోతే లీగల్ వెళ్తా అని హెచ్చరించారు. ‘‘కదిరి ఎమ్మెల్యే నా శిష్యుడు... నాకే సిగ్గు అవుతుంది... ఇతనికి చదువు చెప్పినందుకు’’ అంటూ పల్లెరఘునాథ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-08-22T12:40:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising