JC Prabhakar Reddy: రేయ్ ఏం దాదాగిరీ చేస్తావురా నువ్వు... పోతావ్ రా..
ABN, First Publish Date - 2023-04-25T11:34:17+05:30
అనంతపురం: తాడిపత్రిలో డీఎస్పీ చెప్పిందే లా అండ్ ఆర్డర్ అని, మున్సిపాలిటీలోనూ డిఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు.
అనంతపురం: తాడిపత్రిలో డీఎస్పీ చెప్పిందే లా అండ్ ఆర్డర్ అని, మున్సిపాలిటీలోనూ డిఎస్పీ జోక్యం చేసుకుంటున్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కౌన్సిలర్లపై 307 కేసులు పెడుతున్నారని, డీఎస్పీ ఎమ్మెల్యేకి తొత్తుగా ఉన్నారని, ఇద్దరు బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. లాలూచీతో మున్సిపాలిటీ గబ్బు పడుతోందన్నారు. ఎమ్మెల్యేకి 50 లీటర్ల డీజిల్ మున్సిపాలిటీ నుంచి వేస్తున్నారన్నారు. ‘‘హే డీఎస్పీ ఇంకోసారి ఇంట్లోకి వస్తే చేతుల్లో ఏది ఉంటే దాంతో కొడతా... నీది చాలా ఎక్కువ అయింది.. రేయ్ ఏం దాదాగిరీ చేస్తావురా నువ్వు... పోతావ్ రా.. రేయ్ బీ కేర్ ఫుల్.. ఇంట్లోకి వస్తావా.. ఇంకొకసారి గేటు దాటిరా అరేయ్... ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటో చూపిస్తా.. నీకు పొజిషన్ ఉంది... ఆ పొజిషన్ మేరకు బిహేవ్ చేయి.. నీకేం సంబంధంరా మున్సిపాలిటీ గురించి’’ అంటూ వ్యాఖ్యానించారు. "
డీఎస్పీ ఎక్కడకు వెళ్ళేది ఎక్కడకు పోయేది అంతా తనకు తెలుసునని.. కానీ పోలీసులను కించపరచదలుచుకోలేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. డీఎస్సీ చైతన్య కమలహాసన్...ఎంత డబ్బు సంపాదించారో దానిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాడిపత్రి వాతావరణాన్ని నాశనం చేస్తున్నారని, ఎమ్మెల్యే డబ్బులు ఇస్తుంటే తీసుకుంటున్నారని.. తాడిపత్రిలో ప్రతి దానికి కారకుడు డీఎస్పీయేనని.. ఎస్ఐ, సీఐలను బూతులు తిడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-04-25T11:34:17+05:30 IST