ఆదర్శప్రాయుడు జ్యోతిబా ఫూలే

ABN , First Publish Date - 2023-04-12T00:31:35+05:30 IST

బడుగుల హక్కుల కోసం, స్త్రీ సమానత్వానికి బాటలు వేసిన మహనీయుడు జ్యోతిబా ఫూలే అని కలెక్టర్‌ ఎస్‌.గౌతమి పేర్కొన్నారు. మంగళవారం జ్యోతిబా ఫూలే 197వ జయంతిని నగరంలోని జిల్లా పరిషతలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కలెక్టర్‌ గౌతమి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఆదర్శప్రాయుడు జ్యోతిబా ఫూలే
ఫూలే విగ్రహానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ గౌతమి, అధికారులు

జయంతి వేడుకల్లో కలెక్టర్‌ గౌతమి

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఏప్రిల్‌ 11: బడుగుల హక్కుల కోసం, స్త్రీ సమానత్వానికి బాటలు వేసిన మహనీయుడు జ్యోతిబా ఫూలే అని కలెక్టర్‌ ఎస్‌.గౌతమి పేర్కొన్నారు. మంగళవారం జ్యోతిబా ఫూలే 197వ జయంతిని నగరంలోని జిల్లా పరిషతలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కలెక్టర్‌ గౌతమి, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, జడ్పీ చైర్‌పర్సన బోయ గిరిజమ్మ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జడ్పీ ఆవరణంలోని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో కలెక్టర్‌ గౌతమి ప్రసంగించారు. విద్యతోనే మానవాళి ప్రగతి సాధ్యమని నమ్మిన వ్యక్తి ఫూలే అన్నారు. ఆయన జీవితం తర్వాతి తరాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహితి, కొగటం విజయభాస్కర్‌రెడ్డి, అహుడా ఛైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్‌, రజక కార్పొరేషన చైర్మన మీసాల రంగన్న, ఆర్టీసీ రీజినల్‌ చైర్‌పర్సన మంజుల, నాటక అకాడమీ చైర్‌పర్సన హరిత, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన మేడా రామలక్ష్మి, బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూకొతారీ, ఈడీ నాగముని, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, ఆర్డీఓ మధుసూదన, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు.

బడుగుల ఆశాజ్యోతి ఫూలే

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

అనంతపురం అర్బన: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా ఫూలే అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు కొనియాడారు. ఫూలే జయంతిని పురస్కరించుకుని మంగళవారం అనంతపురం నగరంలోని జడ్పీ కార్యాలయ ఆవరణంలో ఉన్న ఫూలే విగ్రహానికి ఆయన నివాళులర్పించారు.

Updated Date - 2023-04-12T00:31:39+05:30 IST