ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kalavenkatarao: విద్యుత్‌శాఖను కమీషన్ల అడ్డాగా మార్చుకున్నారు

ABN, First Publish Date - 2023-08-09T16:02:17+05:30

అమరావతి: విద్యుత్ ప్రాజెక్టులు అస్మదీయులకు కట్టబెట్టేందుకు అంచనాలు పెంచి ఆ భారాలు వినియోగదారులపై మోపుతున్నారని, విద్యుత్‌శాఖను జగన్ రెడ్డి తన కమీషన్ల అడ్డాగా మార్చుకున్నారని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు.

అమరావతి: విద్యుత్ ప్రాజెక్టులు అస్మదీయులకు కట్టబెట్టేందుకు అంచనాలు పెంచి ఆ భారాలు వినియోగదారులపై మోపుతున్నారని, విద్యుత్‌శాఖను జగన్ రెడ్డి తన కమీషన్ల అడ్డాగా మార్చుకున్నారని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు. బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులపై గత నాలుగేళ్లలో రూ.57 వేల కోట్ల భారాలు మోపారని, విద్యుత్ పరికరాల కొనుగోళ్ల నుంచి విద్యుత్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల వరకు జగన్ రెడ్డి తన సన్నిహితులకే కట్టబెడుతున్నారని విమర్శించారు. విద్యుత్ రంగ నిధులను జగన్ రెడ్డి తన బినామీలకు దోచిపెడుతున్నారని, అవినాష్ రెడ్డి బినామీ అయిన నర్రెడ్డి ఈశ్వేశ్వర్ రెడ్డికి చెందిన షిరిడీసాయికి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్స్, అదానీలకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.

విద్యుత్‌శాఖలో దాదాపు 30 శాతం అంచనాలు పెంచి కాంట్రాక్టులు కట్టబెట్టడుతున్నారని కళావెంకట్రావు విమర్శించారు. జగన్‌రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ శాఖను తన కమీషన్ల అడ్డాగా మార్చుకున్నారని, అస్మదీయ కంపెనీలకు ప్రాజెక్టులు కట్టబెట్టేందుకు టెండర్ నిబంధనలను మార్చేస్తారా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో టెండర్లు వేసినా తమకు రావని అర్హులైన కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. కమీషన్ల కక్కుర్తి కోసం విద్యుత్ రంగాన్ని నాశనం చేశారని, టీడీపీ అధికారంలోకి రాగానే విద్యుత్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీ వేసి నిగ్గుతేలుస్తామని కళావెంకట్రావు అన్నారు.

Updated Date - 2023-08-09T16:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising