ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Peddireddy: సామాజిక న్యాయ బస్సు యాత్ర నిర్వహిస్తాం...

ABN, First Publish Date - 2023-10-19T14:07:26+05:30

అనంతపురం: రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఇంచార్జ్‌లు, నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. సామాజిక న్యాయ బస్సు యాత్ర-వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహణపై మంత్రి సమీక్ష చేశారు.

అనంతపురం: రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandra Reddy) గురువారం అనంతపురం (Anantapuram)లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురం, సత్యసాయి జిల్లాల ఎమ్మేల్యేలు, ఎంపీలు, ఇంచార్జ్‌లు, నియోజకవర్గ పరిశీలకులతో భేటీ అయ్యారు. సామాజిక న్యాయ బస్సు యాత్ర (Social Justice Bus Yatra)-వై ఏపీ నీడ్స్ (Y AP Needs) జగన్ కార్యక్రమం (Jagan Program) నిర్వహణపై మంత్రి సమీక్ష చేశారు. కార్యక్రమాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) ఆదేశాల మేరకు సామాజిక న్యాయ బస్సు యాత్ర నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలను మూడు ప్రాంతాలుగా విభజించి షెడ్యూల్ ఖరారు చేశామన్నారు.

ఈ నెల 26వ తేదీ నుంచి నవంబర్ 9 వరకు 7 రాయలసీమ జిల్లాల్లో 7 సమావేశాలు నిర్వహిస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 26న శింగనమల నియోజకవర్గం నుంచి బస్సు యాత్ర ప్రారంభం అవుతుందన్నారు. వైసీపీ నాయకులందరూ పూర్తి స్థాయిలో శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపిచ్చారు. ‘నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని జగన్ చెప్పే నినాదాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలన్నారు. గతంలో కొన్ని రాజకీయ పార్టీలు తమను వాడుకున్నాయని ప్రజలు గుర్తించారన్నారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు, జిల్లా ముఖ్యనాయకులు కూడా బస్సు యాత్రలో పాల్గొంటారని, వైసీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎంత మేలు చేసిందో వివరిస్తారన్నారు. కృష్ణా జలాలపై న్యాయపోరాటం చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-10-19T14:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising