ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Balakrishna: హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అనేక సమస్యలు...

ABN, First Publish Date - 2023-11-16T13:55:11+05:30

శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గురువారం హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని రోగులు బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు.

శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ (TDP MLA Balakrishna) గురువారం హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని రోగులు బాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలకృష్ణ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ (Superintendent)ను నిలదీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని, వైద్య పరికరాలు లేవని, ఉన్న వాటిని వాడుకోలేదని విమర్శించారు.

గతంలో తాను ఇచ్చిన వెంటిలేటర్లు నిరుపయోగంగా ఉన్నాయని, టీడీపీ హయాంలో ఆస్పత్రి శుభ్రంగా ఉండేదని, ఇప్పుడు అలా లేదని బాలకృష్ణ అన్నారు. కనీసం సీలింగ్ కూడా సరిగా లేదని, ఇవాళ ఆరోగ్య శ్రీ సేవలు (Arogya Shri Services) నిలిపివేస్తామని ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాలు అంటున్నాయన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇచ్చిన నిధులను కూడా వేరే స్కీమ్‌లకు డైవర్ట్ చేశారన్నారు. 460 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం వేరే స్కీమ్‌లకు తరలించిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ఫైన్ కూడా కట్టిందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు శాశ్వత పరిష్కారం ఇంకో 4 నెలల్లో వస్తుందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు.

Updated Date - 2023-11-16T13:55:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising