LokeshYuvaGalam: కియా పరిశ్రమ ముందు లోకేష్ సెల్ఫీ చాలెంజ్... దీన్ని వైసీపీ స్వీకరిస్తుందా?
ABN, First Publish Date - 2023-03-30T10:39:30+05:30
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర 55వ రోజుకు చేరుకుంది.
శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Naralokesh YuvaGalam Padayatra)55వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం పెనుగొండలో లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)ను ప్రారంభించారు. పాదయాత్ర చేస్తూ కియా పరిశ్రమ వద్దకు చేరుకుని ఆ పరిశ్రమను యువనేత పరిశీలించారు. ఈ సందర్భంగా కియా పరిశ్రమ ముందు లోకేష్ సెల్ఫీ చాలెంజ్ (Lokesh Selfie Challenge) విసిరారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చాలా పరిశ్రమలు వచ్చాయని అన్నారు. ఈ పరిశ్రమలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని అందుకే ప్రజలు తమకు ఓటు వేయలేదన్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ సెల్ఫీరూపంలో ప్రజల ముందు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కియా పరిశ్రమ (KIA Industry) ముందు లోకేష్ సెల్ఫీ చాలెంజ్ విసిరారు. అప్పటి ప్రభుత్వంలో అనేక పరిశ్రమలను తీసుకువచ్చామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ప్రజలకు సేవ చేసిందే తప్ప.. చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోలేకపోయామని.. అందుకే ప్రజలు అలాంటి ఫలితాలు ఇచ్చారన్నారు. పాదయాత్రలో దారి వెంబడి వెళ్తుండగా ఉన్న పరిశ్రమల ముందు ఆగి లోకేష్ సెల్ఫీ తీసుకుంటూ ప్రజలకు తెలియజేస్తున్నారు.
వైసీపీ సర్కార్ (YCP Government)ది విధ్వంస పాలన అని విమర్శించారు. అభివృద్ధి చేయాలన్న తలంపు ఏకోశాన జగన్‌కు సర్కార్‌కు లేదని అన్నారు. తాము చేసిన అభివృద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తోంది. కియా పరిశ్రమ రావడం చంద్రబాబు (TDP Chief Chandrababu) ఘనతే అని చెప్పుకొచ్చారు. అధికారం చేపట్టిన తొలినాళ్లలో ప్రజావేదిక కూల్చివేతతో వైఎస్ జగన్ (AP CM Jaganmohan Reddy)పరిపాలనను ప్రారంభించారన్నారు. అన్ని పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్లడమే కానీ కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలు లేవన్నారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సుకు కూడా 13లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పుకున్నారని... విదేశాల నుంచి ఎంవోయూలు కుదర్చుకున్నారని గొప్పలు చెప్పారన్నారు. అయితే స్వరాష్ట్రం నుంచి వచ్చిన వారే తూతూ మంత్రంగా ఎంవోయూలు కుదర్చుకున్నారే తప్ప... ఆ పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని అంతా చెప్పుకుంటున్నారని లోకేష్ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ (TDP) కోసం పనిచేసేందుకు యువత ముందుకు వస్తోందన్నారు. అలాంటి యువతకు ప్రాధాన్యత ఇచ్చి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తరాలు మారుతున్నాయని యువరక్తం పార్టీలో పారాల్సిన అవసరం ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల కన్నా.. తాను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే ఎక్కువన్నారు. వందలకొద్ది కార్యక్రమాలు చేశామని... ఆ అర్హతతోనే పాదయాత్ర చేస్తున్నట్లు లోకేష్ పేర్కొన్నారు.
Updated Date - 2023-03-30T10:43:38+05:30 IST