ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anantapuram: జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం చుట్టూ మొహరించిన పోలీసులు

ABN, First Publish Date - 2023-08-20T12:25:05+05:30

అనంతపురం జిల్లా: తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం చుట్టూ పోలీసులు మొహరించారు. జేసీ నివాసానికి వెళ్లే దారులన్నింటినీ స్పెషల్ పార్టీ పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న జేసీ అనుచరులను బయటకు పంపారు.

అనంతపురం జిల్లా: తాడిపత్రి (Tadipatri)లో జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) నివాసం చుట్టూ పోలీసులు మొహరించారు. జేసీ నివాసానికి వెళ్లే దారులన్నింటినీ స్పెషల్ పార్టీ పోలీసులు (Police) ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఉన్న జేసీ అనుచరులను బయటకు పంపారు. జేసీ నివాసం ఎదురుగా జూనియర్ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణం విదాస్పదంగా మారింది. ప్రహరీ గోడ నిర్మాణానికి కాంట్రాక్టర్ గోతులు తవ్వారు. అయితే ఆ తవ్విన గోతులను గుర్తుతెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి పూడ్చివేశారు. అయితే 60 అడుగుల రోడ్డును వదిలి ప్రహరీ గోడ నిర్మాణం పనులు చేపట్టాలని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు.

కాగా ప్రహరీగోడ నిర్మాణ కాంట్రాక్టు పనుల సాకుతో జేసీ ఇంటి పరిసరాల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి (Ketireddy Peddareddy) అనుచరులు తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. మరికొద్ది సేపట్లో జేసీ నివాసముందు ప్రహరీ గోడ నిర్మాణ పనులు పరిశీలించడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో జేసీ నివాసం ముందుకు ఎమ్మెల్యే రావడానికి పోలీసులు మార్గం సుగమం చేస్తున్నారు. సీఐ హమీద్ ఖాన్ జేసీ నివాసంలో ఉన్న అనుచరులను బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు అనుసరిస్తున్న తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-08-20T12:25:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising