Draupadi Murmu: శ్రీ సత్యసాయి జిల్లాకు నేడు రాష్ట్రపతి రాక
ABN, First Publish Date - 2023-11-22T08:24:52+05:30
శ్రీ సత్యసాయి జిల్లా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తికి రానున్నారు. పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 42వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరుకానున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President of India Draupadi Murmu) బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai Dist.)లోని పుట్టపర్తి (Puttaparthi)కి రానున్నారు. పుట్టపర్తిలో ఈరోజు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ (Sathya Sai Deemed University) 42వ స్నాతకోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి హాజరుకానున్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి బంగారు పథకాలు ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకలు సాయి హీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్నాయి. పుట్టపర్తిలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
రాష్ట్రపతి టూర్ షెడ్యూల్..
రాష్ట్రపతి బుధవారం మధ్యాహ్నం ఒడిశాలో బయలుదేరి 2.35 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 2.45 గంటలకు ప్రశాంతి నిలయం చేరుకుంటారు. సాయంత్రం 3.05 గంటలకు సాయి కుల్వంత్ మందిరంలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారు. అనంతరం సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ 42వ స్నాతకోత్సవంలో పాల్గొంటారు. విద్యార్థులకు డాక్టరేట్లు, బంగారు పథకాల ప్రధానం అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4.20 గంటలకు రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు.
Updated Date - 2023-11-22T08:24:54+05:30 IST