YuvaGalam: 700 కిలోమీటర్లు.. ఏడు హామీలు... 55రోజుల లోకేష్ పాదయాత్ర విశేషాలు ఇవే..
ABN, First Publish Date - 2023-03-30T14:09:49+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రం 700 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది.
శ్రీసత్యసాయిజిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 700 కిలోమీటర్ల మైలురాయి (700 K.M Milestone) కి చేరుకుంది. గురువారం ఉదయం 55వరోజు పాదయాత్ర మొదలైంది. కియా పరిశ్రమను పరిశీలించిన అనంతరం గుట్టూరు గ్రామంలోకి పాదయాత్ర ప్రవేశించింది. దీంతో గుట్టూరు గ్రామంలో యువగళం (YuvaGalam) 700 కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 55 రోజుల యువగళం పాదయాత్ర విశేషాలు ఏంటో చూద్దాం...
లోకేష్ యువగళం పాదయాత్రను కుప్పం నియోజవర్గంలోని లక్ష్మీపురం శ్రీవరదరాజుల ఆలయం నుంచి జనవరి 27న ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. ప్రగతికి పునాదిరాళ్లు.. యువగళం మైలురాళ్లు అనే పేరుతో జనంలోకి వెళ్తున్నారు. పాదయాత్రలో ప్రతీ వంద కిలోమీటర్లకు ఒక మైలురాయిగా తీసుకుని నిర్ధిష్ట అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి వస్తే ఏం చేస్తామో స్పష్టంగా చెబుతూ శిలాఫలకాలు ఆవిష్కరిస్తున్నారు. అభివృద్ధిపనులు, సమస్యలకు శాశ్వత పరిష్కారంగా లోకేష్ హామీలు ఇస్తున్నారు. పాదయాత్రలో ప్రతీ వంద కిలోమీటర్లకు ఇస్తున్న హామీలు టీడీపీ ప్రభుత్వం (TDP Government) వచ్చిన వెంటనే వందరోజుల్లో నెరవేర్చాలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రతీ మైలురాయి వద్ద లోకేష్ ఇచ్చిన హామీలు ఇవే...
లోకేష్ పాదయాత్ర ఆరంభించిన తర్వాత వంద కిలోమీటర్ల మైలురాయి పూర్తిచేసుకున్న సందర్భంగా పోతలపట్టు నియోజకవర్గంలోని బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రాన్ని సొంత నిధులతో ఏర్పాటు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
200 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో కార్వేటినగరం మండలం కత్తెరపల్లి వద్ద డిగ్రీ కళాశాలకు టీడీపీ ప్రభుత్వం రాగానే అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
300 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొండమానుపురం పంచాయతీ పరిధిలో పదమూడు గ్రామాల దాహార్తి తీర్చే తాగునీటి పథకం ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు.
400 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలోకి పాకాల మండలం నేంద్రగుంటలో ఆధునిక వసతులతో పది పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అధికారంలోకి రాగానే ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
500 కిలోమీటర్లు చేరుకున్న సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలోని చిన్నతిప్ప సముద్రం -2 వద్ద టమోటా ప్రాసెస్ యూనిట్, కోల్డ్ స్టోరేజ్ నిర్మాన పనులకు అనుమతులు మంజూలు చేస్తామన్నారు.
600 కిలోమటర్లు చేరుకున్న సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో చిన్నయెల్లంపల్లి వద్ద టెంపుల్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
తాజాగా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలోని కియా పరిశ్రమ వద్ద 700 కీలోమీటర్ల మైలురాయి దాటారు. ఈ సందర్భంగా మరొక అంశంపై ప్రజలకు హామీ ఇచ్చారు. హంద్రీనివా కాలువ నుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తామని, మడకశిర ప్రాంతవాసుల తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇస్తూ పాదయాత్రలో ముందుకు సాగారు.
Updated Date - 2023-03-30T15:26:19+05:30 IST