ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam: 54వ రోజుకు యువగళం.. సోమందేపల్లిలో లోకేష్‌కు ఘన స్వాగతం

ABN, First Publish Date - 2023-03-29T11:43:44+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader NaraLokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పెనుకొండ నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతోంది. 54వ రోజు నల్లగొండ్రాయనపల్లి నుంచి యువనేత పాదయాత్ర (YuvaGalam Padayatra)ను మొదలుపెట్టారు. పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. పాదయాత్ర (Lokesh Padayatra)లో భాగంగా సోమందేపల్లిలో లోకేష్‌ (Lokesh YuvaGalam)కు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. లోకేష్‌ని కలిసి తమ బాధలు చెప్పుకోవడానికి ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్దులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి బ్రతకడం కష్టంగా మారిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. పన్నుల భారం విపరీతంగా పెంచేశారని.. ఆఖరికి చెత్త పన్ను కూడా కట్టాలి అంటూ వేధిస్తున్నారని మహిళలు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని మహిళలకు లోకేష్ హామీ ఇచ్చారు. అనంతరం వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

పాదయాత్రకు ముందు ఉదయం తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహానికి లోకేష్ పూలమాట వేసి నివాళులర్పించారు. ఆపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులను యువనేత సన్మానించారు. ఆపై సెల్ఫీవిత్ లోకేష్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి లోకేష్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీపడ్డారు.

Updated Date - 2023-03-29T11:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising