AP News: తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత.. చైర్మన్ జేసీ సహా టీడీపీ కౌన్సిలర్ల నిరసన
ABN, First Publish Date - 2023-07-27T12:09:38+05:30
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో (Tadipatri Municipal Office) దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కమిషనర్ నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ కౌన్సిలర్లు నినాదాలు చేశారు.
అనంతపురం: తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో (Tadipatri Municipal Office) దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మున్సిపల్ కమిషనర్ తీరును నిరసిస్తూ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తెలుగుదేశం కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కమిషనర్ నిర్లక్ష్య వైఖరి నశించాలంటూ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. కమిషనర్ ఏకపక్ష ధోరణి నశించాలని నినదించారు. ప్రొటోకాల్ పాటించాలంటూ డిమాండ్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లోకి రాకుండా టీడీపీ కౌన్సిలర్లు బైఠాయించి నిరసన చేపట్టారు. అలాగే చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) కూడా తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో నిరసన కొనసాగిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ చాంబర్ ఎదురుగా మంచం వేసుకుని అక్కడే నిద్రించారు. అంతేకాకుండా ఉదయాన్నే బ్రష్, స్నానం మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే నిర్వహించారు.
ప్రొటోకాల్ పాటించకుండా తాడిపత్రి పట్టణంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి కమిషనర్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీ కౌన్సిలర్లను ఆహ్వానించకపోవడంపై మున్సిపల్ కార్యాలయం వేదికగా విపక్ష కౌన్సిలర్ల ఆందోళన చేపట్టారు. ఆరు రోజులుగా ఆందోళన చేస్తున్న పట్టించుకోకపోవడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి సమాధానం చెప్పేంతవరకు ఆందోళన విరమించేది లేదని జేపీ ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి తన కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి మున్సిపల్ ఆఫీస్‌కు చేరుకున్నారు. అనంతరం కమిషనర్‌ను ఎమ్మెల్యే ఛాంబర్‌లోకి తీసుకెళ్లారు.
Updated Date - 2023-07-27T12:17:34+05:30 IST